AI Representative image
విశాఖ: అక్కయ్యపాలెంలో ఓ మహిళ హత్య కలకలం రేపింది. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దారుణానికి తెగబడ్డారు. పార్వతి (50) అనే మహిళ కాళ్లు, చేతులు కట్టేసి, హత్య చేశారు. ఆమె ఇంట్లోని లాకర్‌ను బద్దలుకొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారు.
ఈ ఘటన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కయ్యపాలెం శ్రీనివాస్‌నగర్, పుట్ట బంగారమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. బంగారం కోసమే ఈ హత్య జరిగి ఉంటుందనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు.


