అనంతపురం జిల్లా పామిడిలో అశేష జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
అనంతపురం జిల్లా పామిడిలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికిన ప్రజలు, పార్టీ శ్రేణులు
వారందరికీ అభివాదం చేస్తూ ఆప్యాయంగా
పలకరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
వివాహ రిసెప్షన్‌కు హాజరై దంపతులకు ఆశీస్సులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కుమారుడు చైతన్యమిత్ర, అనంతపురం జిల్లా పామిడికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత వీరాంజనేయులు కుమార్తె, ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్‌పర్సన్ లిఖితలకు ఇటీవల వివాహమైంది. మంగళవారం పామిడిలో నిర్వహించిన వీరి రిసెప్షన్‌కు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేశారు.

వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కడికి భారీగా చేరుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. అంతకు ముందు వేదిక ప్రాంతానికి వస్తుండగా దారిపొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. వారందరికీ వైఎస్ జగన్ చిరునవ్వుతో అభివాదం చేశారు. యువతతో కరచాలనం చేస్తూ, చిన్నారులను ముద్దాడుతూ ముందుకు సాగారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డితో పాటు పార్టీ నేతలు పలువురు వధూవరులను ఆశీర్వదించారు.


