పోక్సో కేసులో మహిళా అధికారికి ఐదేళ్ల జైలు శిక్ష | POCSO Court Sentences Woman to 20 Years in Prison | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో మహిళా అధికారికి ఐదేళ్ల జైలు శిక్ష

May 13 2026 5:37 AM | Updated on May 13 2026 5:37 AM

POCSO Court Sentences Woman to 20 Years in Prison

ఒంగోలు: పోక్సో కేసులో ఓ మహిళా ప్రత్యేక అధికారికి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గొట్టిపాటి శ్రీనివాసరావు అందించిన వివరాల మేరకు.. 2018 జూన్‌ 26న ఓ విద్యార్థిని పట్ల అదే విద్యాలయంలో మహిళా ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహిళ అసభ్యకరంగా ప్రవర్తించారు.

ఈ ఘటనపై అప్పటి మర్రిపూడి ఎస్‌ఐ శ్రీహరి కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషిటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం మహిళా ప్రత్యేక అధికారికి 5 సంవత్సరాల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధించారు. బాధిత విద్యార్థినికి రూ.22 వేలు పరిహారం అందించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చర్యలు చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement