నరేంద్ర.. రైతులపై దౌర్జన్యం చేస్తారా?: అంబటి ఫైర్‌ | YSRCP Ambati Rambabu Serious On TDP MLA Dhulipalla Narendra | Sakshi
Sakshi News home page

నరేంద్ర.. రైతులపై దౌర్జన్యం చేస్తారా?: అంబటి ఫైర్‌

May 13 2026 1:32 PM | Updated on May 13 2026 1:57 PM

YSRCP Ambati Rambabu Serious On TDP MLA Dhulipalla Narendra

సాక్షి, గుంటూరు: ఏపీలో రైతులపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మామిళ్లపల్లి ఘటనపై సిగ్గుపడాలి అని ఘాటు విమర్శలు చేశారు. రైతుల కాలి ధూళికి ధూళిపాళ్ల ఓడిపోతారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు.

మొక్కజొన్న రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ చలో మామిళ్లపల్లి పిలుపు నిలిచింది. మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే ధూళిపాళ్ల రైతుల గోడౌన్లు, ఇళ్లపై దాడులు చేయిస్తున్నారు. రైతులు దాచుకున్న మొక్కజొన్న గోడౌన్‌పై ధూళ్ళిపాళ్ల అనుచరులు దాడిచేశారు. మామిళ్ళపల్లి దాడితో సిగ్గు పడాలి. ప్రశ్నించే వారే లేరని దాడులు చేస్తున్నారా?. మా కుటుంబంపై, మా కులంపై, మా పార్టీపై కక్ష కట్టారా?. ఎన్నాళ్ళు మీకు అధికారం ఉంటుంది. అంతకుముందు ఓడిపోలేదా?.

మూడేళ్ళ ముందే చెబుతాను రాసుకోండి.. వచ్చే ఎన్నికల్లో ధూళ్ళిపాళ్ల నరేంద్ర ఓడిపోవడం ఖాయం. గోడౌన్లు, ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేస్తున్నారు. గుంటూరు ఐజి త్రిపాఠీ ఖాకీ డ్రెస్స్ వేసుకోవడం లేదు. పచ్చ డ్రెస్స్ వేసుకుంటున్నాడు. లోకేష్, పెమ్మసాని ఏది చెబితే అది చేస్తున్నాడు. అదే చేస్తున్నాడు. మీరు భయపడితే వంగవీటి మోహన్ రంగాలా చంపేస్తారు. తప్పు చేస్తే ఎంత పెద్ద అధికారి అయినా చట్ట ప్రకారం బట్టలు ఊడదీస్తాం. త్రిపాఠికి చెబుతున్నా.. తప్పుడు కేసు తొలగించాలి. అరెస్ట్ చేస్తే జైలు కొచ్చి కూర్చొంటాం. గోడౌన్‌లో ఉన్న మొక్కజొన్న వెంటనే రిలీజ్ చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement