చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా?: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Serious On Chandrababu Government | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా?: వైఎస్‌ జగన్‌

May 16 2026 3:15 PM | Updated on May 16 2026 4:04 PM

Ys Jagan Serious On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షోభంలోకి తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు, అవినీతి వలనే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదంటూ ట్వీట్ చేశారు. ‘‘అభివృద్దిలో దూసుకుపోతున్నామంటూ అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ప్రజల దృష్టిని మరల్చటానికే అభివృద్ది, సంపద సృష్టి అంటూ ప్రచారం చేస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

‘‘2025-26 ఆర్థిక సంవత్సరపు కాగ్ నివేదికలు చూస్తే పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర డీఎస్డీపీ వృద్దిరేటు 10.75శాతం నమోదయిందంటున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వపు సొంత పన్ను ఆదాయాలు 3.22 శాతం తగ్గిపోయాయి. ఏదైనా రాష్ట్రం అభివృద్ది చెందుతుందంటే అక్కడ పెట్టుబడులు, వినియోగం పెరుగుతాయి. అందువల్ల ప్రభుత్వానికి పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయి. కానీ ఏపీలో 3.22 శాతం తగ్గటం అంటే అర్థం ఏంటి?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

‘‘మా ప్రభుత్వం చివరి సంవత్సరంలో రాష్ట్ర పన్నుల ఆదాయాలు రూ. 85,922.23 కోట్లు. ఆ తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో కనీసం 8 శాతం సాధారణ వృద్ధి నమోదై ఉంటే, ఈ ఏడాదికి రూ. 1,00,219.69 కోట్లకు చేరుకోవాలి. కానీ వాస్తవంగా వచ్చిన ఆదాయం కేవలం రూ. 86,552.68 కోట్లు మాత్రమే. మరి చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా?. గతేడాది ఏపీఎండీసీ ద్వారా సమీకరించిన రూ.9 వేల కోట్ల ద్వారా కూడా ఎలాంటి సంపద సృష్టి జరగలేదు. గతేడాది ఆదాయాలు తగ్గితే కనీసం ఈ ఏడాదైనా పెరిగేలా చూసుకోవాలి. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వపు విధానాలు, అవినీతి చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లింది.

సంక్షోభంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన

 ..జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు కూడా 5 శాతం కూడా పెరగలేదు. ఎక్సైజ్ ఆదాయాలు కూడా 8.20 శాతం తగ్గాయి. కూటమి ప్రభుత్వం మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటీకరించింది. విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, పర్మిట్ రూమలను ప్రవేశ పెట్టింది. అయినప్పటికీ ఆదాయం పెరగకపోగా, తగ్గటానికి కారణం అవినీతి, అక్రమాలే. సేల్ ట్యాక్సుల ఆదాయం ఈ రెండేళ్లలో పెరగకపోగా, ఇంకా తగ్గిపోయాయి. మొత్తం మీద రాష్ట్ర స్వంత పన్ను ఆదాయాలు 3.22 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement