గుంటూరు: నిడబ్రోలులో కాల్పుల కలకలం | Guntur: Shots Fired at Railway Signal Near Nidubrolu | Sakshi
Sakshi News home page

గుంటూరు: నిడబ్రోలులో కాల్పుల కలకలం

May 12 2026 7:39 AM | Updated on May 12 2026 8:00 AM

Guntur: Shots Fired at Railway Signal Near Nidubrolu

సాక్షి, గుంటూరు: నిడబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. రైల్వే సిగ్నల్‌ దగ్గర దుండగులు కాల్పులు జరిపారు. సిగ్నల్‌ వ్యవస్థను ట్యాంపరింగ్‌ చేసే ప్రయత్నం చేశారు. దీంతో జీఆర్పీఎఫ్‌ పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. నిడుబ్రోలు సమీపంలో రైల్వే సిగ్నల్స్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గస్తీ కాస్తున్న జిఆర్పీ పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు.

ఈ క్రమంలో పోలీసులు.. పది రౌండ్లు కాల్పులు జరిపారు. సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్‌ పాల్పడితే కాల్పులు జరుపుతామని గతంలో జీఆర్పీఎఫ్‌ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇదే మార్గంలో నెల రోజుల క్రితం రైలు ఆపిన  దొంగలు.. దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో జీఆర్పీఎఫ్‌ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement