సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి జోగి రమేశ్ చేపట్టిన మామిళ్లపల్లి పర్యటనకు పోలీసులు అడ్డుతగిలారు. అధికారులు సీజ్ చేసిన గోడౌన్‌ను పరిశీలించేందుకు, రైతుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో సోమవారం ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మరోసారి అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జోగి రమేశ్ కార్యకర్తలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో ఈ మధ్య కాలంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మొక్కజొన్న రైతులపై జరిగిన దాడులు, అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అక్రమ కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చింది. దీంతో సర్కార్ కూటమి కుట్రలకు దిగింది.


