తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్‌ జగన్‌ ఫోన్‌ | YS Jagan Phone Call Conversation With CM Vijay, Extends Wishes For Transparent And People Centric Governance In Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్‌ జగన్‌ ఫోన్‌

May 13 2026 8:45 PM | Updated on May 14 2026 11:29 AM

YS Jagan had a phone conversation with CM Vijay

సాక్షి,గుంటూరు: తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేశారు.

ఫోన్‌ సంభాషణలో సీఎం విజయ్‌తో.. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. సమర్థవంతమైన, పారదర్శకమైన.. ప్రజాపాలన అందించాలి. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలి. తమిళనాడు ప్రజలు మీ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి, సమగ్ర పాలన, ప్రజా సంక్షేమం దిశగా ముందుకు నడిపించాలి. మీ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలి. భారత సమగ్ర ప్రగతికి బలమైన భాగస్వామిగా నిలవాలని కోరుకుంటున్నాని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు 
 

 

అంతకు ముందు మే4న తమిళనాడులో అనూహ్య ఫలితాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న సమయంలో విజయ్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. సోదరుడు విజయ్‌కు అభినందనలు అంటూ వైఎస్‌ జగన్ ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్‌కు మరింత మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు.  తాజాగా, ఇవాళ వైఎస్‌ జగన్‌ విజయ్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement