28 నెలల నుంచి జీతాల్లేవ్‌ బాబూ..! | Panchayat Raj site engineers are not receiving their salaries: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

28 నెలల నుంచి జీతాల్లేవ్‌ బాబూ..!

Jul 24 2026 5:19 AM | Updated on Jul 24 2026 5:19 AM

Panchayat Raj site engineers are not receiving their salaries: Andhra Pradesh

42 మంది పంచాయతీరాజ్‌ సైట్‌ ఇంజినీర్ల ఆవేదన 

జీతాలు ఇవ్వకుంటే అందరికీ ఆత్మహత్యే శరణ్యం 

సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్‌కు అసోసియేషన్‌ విజ్ఞప్తి 

 సాక్షి, అమరావతి: జీతాలు ఇవ్వకపోవడంతో గత 28 నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే జీతాలు ఇప్పించాల్సిందిగా పంచాయతీరాజ్‌ సైట్‌ ఇంజినీర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్ల అసోసియేషన్‌  సీఎం, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

28 నెలలుగా జీతాలు నిలిపివేయడంతో 42 మంది జీతాలు లేక చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ చీఫ్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా జీతాలు ఇవ్వను, ఆఫీస్‌కు రావద్దని కేకలు వేశారని సీఎంకు, ఉప ముఖ్యమంత్రి, సీఎస్‌కు పంపిన వినతిపత్రంలో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షడు వై.దివాకర్‌బాబు పేర్కొన్నారు. 42 మందికి తక్షణమే జీతాలు ఇప్పించాలని లేదంటే అందరికీ ఆత్మహత్యలే శరణ్యమని, ఈ ఆత్మహత్యలకు పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ చీఫ్‌ బాధ్యులవుతారని వినతిపత్రంలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement