న్యాయం అడిగిన గురువులకు బాబు బేడీలు | Tribal Welfare Outsourcing Teachers Protest: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

న్యాయం అడిగిన గురువులకు బాబు బేడీలు

Jul 24 2026 5:24 AM | Updated on Jul 24 2026 5:24 AM

Tribal Welfare Outsourcing Teachers Protest: Andhra Pradesh

పోలీస్‌స్టేషన్‌లో కూర్చున్న ఉపాధ్యాయులు

ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డ ఔట్‌ సోర్సింగ్‌ గురుకుల ఉపాధ్యాయులు

గురుకుల రాష్ట్ర కార్యాలయం వద్ద 15 రోజులుగా ఉద్యమం

అణగదొక్కేందుకు బాబు ప్రభుత్వం కుట్ర

కాపుకాసి వచ్చినవారిని వచ్చినట్లు నిర్బంధం

తాడేపల్లి రూరల్‌:  ఉద్యోగాలు కోల్పోయి నెలల తర­బడి న్యాయం కోసం పోరాడుతున్న ఔట్‌­సోర్సింగ్‌ గురుకుల ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభు­త్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మిడి సంధ్యారాణికి ఇటీవల వారు వినతిపత్రాన్ని అందించడానికి ప్రయత్నించడం, ఇందుకు నిరా­క­రిస్తూ ఆమె కాన్వా­య్‌ ముందుకు దూసుకు­పోవడం అలాగే మంత్రి నారా లోకేశ్‌ నివాసానికి వెళ్లి న్యా­యం చేయాలని కోరదామని బాధితులు సిద్ధమ­వుతుండడం దీనికి నేపథ్యం.  ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా గురుకుల పాఠ­శాలలో పనిచేస్తున్న గిరిజన ఔట్‌ సోర్సింగ్‌ ఉపా­ధ్యాయులను ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొల­గించడంతో గత 15 రోజులుగా తాడేపల్లి పట్టణ పరిధిలోని గురుకుల రాష్ట్ర కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 అనంతరం వివిధ ప్రాంతాల్లో తలదాచుకుని మరుసటి రోజు వారి డిమాండ్ల సాధన కోసం మళ్లీ అక్కడికి వచ్చి తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.  గురువారం కూడా నిరసన ఉద్యమానికి వచ్చిన వీరిని వచ్చిన వారిని వచ్చినట్లు ఉదయం 6 గంటల నుంచే తాడేపల్లి పోలీసులు అరెస్ట్‌ చేయడం ప్రారంభించారు. కొంతమందిని ప్రకాశం బ్యారేజ్‌ వద్ద, మరికొంతమందిని ఉండవల్లి అమరావతి కరకట్ట వద్ద  వెంబడించి మరీ అరెస్ట్‌ చేశారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన అరెస్ట్‌ల పర్వం 9 గంటల వరకు కొన­సాగుతూనే ఉంది. మొత్తం 50 మందిని అరెస్ట్‌ చేయగా, 46 మందిని తాడేపల్లి పోలీస్‌­స్టేషన్‌కు తీసుకువచ్చారు. 

మిగిలిన నలుగురిని తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లినట్లు సమా­చా­రం.  అరెస్టయిన ఉపాధ్యా­యుల్లో ఎక్కువ మంది మహి­ళలున్నారు. ఒక ఉపాధ్యా­యురాలు నీరసం వచ్చి పోలీస్‌­స్టేషన్‌లో ఉన్న బల్లపై పడిపోయింది. 15 గంటలు పోలీసుల నిర్బంధంలో గడిపిన వీరికి రాత్రి 9 గంటలకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు. కాగా, అరెస్టు అయిన ఉపాధ్యాయులు కనీసం వాష్‌రూమ్‌లు,  నీళ్లులేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement