ఏసీబీ డీఎస్పీగా శిరీష | Sirisha as ACB DSP | Sakshi
Sakshi News home page

ఏసీబీ డీఎస్పీగా శిరీష

May 16 2026 11:42 AM | Updated on May 16 2026 1:50 PM

Sirisha as ACB DSP

ఒంగోలు సిటీ: ఒంగోలు ఏసీబీ డీఎస్పీగా ఎస్‌.శిరీష శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల్లో అవినీతి పెరుగుతోందన్నారు. పింఛన్లు, రేషన్, భూమి సమస్యలు, మున్సిపల్‌ సేవలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాల్లో కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు ఇస్తే వారి పనులు తాము దగ్గరుండి రూపాయి ఖర్చు లేకుండా చేయిస్తామని తెలిపారు. 

అవినీతిని అరికట్టేందుకు ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు ఇవ్వాలన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లయితే వెంటనే 9440446189, 9440446187, 8333925624 నంబర్‌కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వవచ్చాన్నరు. మీ వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుతారని చెప్పారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement