పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏపీలోనే అధికం: వెల్లంపల్లి | Ysrcp Leader Vellampalli Srinivas Fires On Nara Lokesh | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏపీలోనే అధికం: వెల్లంపల్లి

May 16 2026 2:36 PM | Updated on May 16 2026 3:43 PM

Ysrcp Leader Vellampalli Srinivas Fires On Nara Lokesh

సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ పై చీటింగ్ కేసు పెట్టాలి.. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు చెప్పి, ఇప్పుడు మోసం చేశారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా పెట్రోలు, డీజిల్ ధర ఏపీలోనే ఉందని.. ప్రజల మీద రోజుకు రూ.10 కోట్ల భారం వేయటం దుర్మార్గం అని ధ్వజమెత్తారు.

ఏపీతో పోల్చితే తెలంగాణ లో 3, తమిళనాడు 10, కర్ణాటకలో 7 రూపాయలు తక్కువ. ఏపీలో మాత్రం టాక్సుల పేరుతో దోచుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. ధరలు తగ్గించకపోగా కార్లు, బైకుల మీద ప్రయాణం చేయొద్దంటూ నీతులు చెప్తారా?. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ పేరుతో చంద్రబాబు ప్రతినెలా ఈవెంట్‌లు చేస్తూ మరింత వృథా చేస్తున్నారు’’ అని వెల్లంపల్లి నిలదీశారు.

‘‘పెట్రోలు, డీజిల్‌పై టాక్స్‌లు ఎందుకు తగ్గించటం లేదు?. చంద్రబాబు నీతి కబుర్లు ఆపి, టాక్సులు తగ్గించాలి. లీటరు పెట్రోలు మీద 28లు ప్రభుత్వానికి వస్తాయని లోకేష్ ఆనాడు చెప్పారు. అందులో సగం తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారు. ప్రజల మీద ఈ బాదుడు ఆపకపోతే పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్‌ హెచ్చరించారు.

పెట్రోల్ ధరలపై ఎన్నికల ముందు వీడియో చూపిస్తూ.. చీటర్... జైల్లో వేయాలి..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement