ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 విజేతగా భారత్ నిలిచింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. తొలి వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్‌లో 246 పరుగులకు ఆలౌటైంది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ లారా వోల్వార్డ్(101) అద్బుతమైన సెంచరీతో పోరాడనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయింది. భారత బౌలర్లలో దీప్తీ శర్మ ఐదు వికెట్లతో చెలరేగగా.. షఫాలీ వర్మ రెండు, చరణి ఒక్క వికెట్ సాధించింది.


