
ఏపీలో క్రికెట్ క్రీడా సమరానికి అంతా సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ఏపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ నేటి నుంచే క్రికెట్ ఫ్యాన్స్ను అలరించనుంది. ఈ సందర్భంగా మెగా హీరో ఆ టీమ్కు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. విజయవాడ సన్ షైనర్స్ టీమ్కు అల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో పాటు పెద్ది మూవీలోని క్రికెట్ షాట్‌ను రీ క్రియేట్ చేసిన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ యాజమాన్యంలో విజయవాడ సన్ షైనర్స్ టీమ్ లీగ్లో పాల్గొంటొంది. ఈ సీజన్లో మొత్తం ఏడు జట్లు ఆడనున్నాయి.
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి పెద్ది అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. రూరల్ క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా.. ఈ ఏడాది ఏప్రిల్లో పెద్ది మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయగా.. రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. క్రికెట్లో డిఫరెంట్ షాట్‌ను అభిమానులకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.
#APL2025 begins today in the beautiful city of Visakhapatnam.
All the best to the teams participating.
Sending special wishes to @vjasunshiners owned by the dearest @MythriOfficial
Hoping for a cracking tournament.@theacatweets pic.twitter.com/4wtDtvmtXl— Ram Charan (@AlwaysRamCharan) August 8, 2025