ఆహా... ఏమా ఆట... ఏమా పోరాటం! | Smriti Mandhana’s Blazing Century in High-Scoring Thriller, India Lose to Australia Women by 43 Runs | Sakshi
Sakshi News home page

ఆహా... ఏమా ఆట... ఏమా పోరాటం!

Sep 21 2025 9:47 AM | Updated on Sep 21 2025 11:12 AM

7 Highest Totals In Womens ODI Cricket

ఆహా... ఏమా ఆట... ఏమా పోరాటం! బంతి బెంబేలెత్తిపోయేలా... బౌండరీలు చిన్నబోయేలా సాగిన పోరులో టీమిండియా పరాజయం పాలైనా... తమ ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకుంది. బెత్‌ మూనీ భారీ సెంచరీతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా రికార్డు స్కోరు చేయగా... స్మృతి మంధాన వీరవిహారం చేయడంతో ఒక దశలో గెలుపు సులువే అనిపించినా... ఆఖరికి భారత మహిళల జట్టుకు ఓటమి తప్పలేదు. హర్మన్‌ప్రీత్‌ బృందం సిరీస్‌ కోల్పోయినా.. వన్డే ప్రపంచకప్‌నకు ముందు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని అందుకుంది!

న్యూఢిల్లీ: పరుగుల వరద పారిన పోరులో భారత మహిళల క్రికెట్‌ జట్టు పోరాడి ఓడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన ఆఖరి వన్డేలో హర్మన్‌ప్రీత్‌కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు 43 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. దీంతో ఆసీస్‌ 2–1తో సిరీస్‌ చేజిక్కించుకుంది. మొదట ఆ్రస్టేలియా 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెత్‌ మూనీ (75 బంతుల్లో 138; 23 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ సెంచరీతో విజృంభించగా... జార్జియా వాల్‌ (68 బంతుల్లో 81; 14 ఫోర్లు), ఎలీస్‌ పెర్రీ (72 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఛేదనలో భారత జట్టు 47 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (63 బంతుల్లో 125; 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) సుడిగాలి సెంచరీతో ప్రత్యరి్థని వణికించగా... దీప్తి శర్మ (58 బంతుల్లో 72; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (35 బంతుల్లో 52; 8 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో మెరిశారు. చివర్లో స్నేహ్‌ రాణా (35; 3 ఫోర్లు) పోరాడినా... టీమిండియా లక్ష్యానికి 43 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించేకు ఈ మ్యాచ్‌లో భారత జట్టు గులాబీ రంగు జెర్సీలు ధరించి ఆడింది.

మహిళల అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతమైన (50 బంతుల్లో) సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా స్మృతి నిలిచింది. ఆసీస్‌ ప్లేయర్‌ లానింగ్‌ (45 బంతుల్లో; న్యూజిలాండ్‌పై) అగ్రస్థానంలో ఉంది. భారత జట్టు తరఫున ఇదే వేగవంతమైన శతకం కాగా... గతంలో ఆమె 70 బంతుల్లో చేసిన సెంచరీ ఇప్పుడు రెండో స్థానానికి చేరింది.

స్కోరు వివరాలు 
ఆ్రస్టేలియా మహిళల ఇన్నింగ్స్‌: హీలీ (సి) హర్మన్‌ప్రీత్‌ (బి) క్రాంతి 30; జార్జియా (సి) (సబ్‌) ఉమ 81; పెర్రీ (సి) క్రాంతి (బి) అరుంధతి 68; మూనీ (రనౌట్‌) 138; గార్డ్‌నర్‌ (సి) రాధ (బి) రేణుక 39; తహిలా (ఎల్బీ) (బి) దీప్తి 14; గ్రేస్‌ (సి అండ్‌ బి) దీప్తి 1; జార్జియా (సి) హర్మన్‌ప్రీత్‌ (బి) రేణుక 16; అలానా (సి) స్నేహ్‌ రాణా (బి) అరుంధతి 12; గార్త్‌ (సి అండ్‌ బి) అరుంధతి 1; షుట్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్‌) 412. వికెట్ల పతనం: 1–43, 2–150, 3–256, 4–338, 5–378, 6–379, 7–380, 8–399, 9–406, 10–412. బౌలింగ్‌: క్రాంతి 6–0–56–1; రేణుక 9–0–79–2; స్నేహ్‌ రాణా 10–0–68–1; అరుంధతి 8.5–0–86–3; దీప్తి 10–0–75–2; రాధ 4–0–48–0. 
భారత మహిళల ఇన్నింగ్స్‌: ప్రతీక (సి) మూనీ (బి) గార్త్‌ 10; స్మృతి (సి) గార్డ్‌నర్‌ (బి) గ్రేస్‌ 125; హర్లీన్‌ (సి) మూనీ (బి) షుట్‌ 11; హర్మన్‌ప్రీత్‌ (ఎల్బీ) (బి) గార్త్‌ 52; దీప్తి (సి) (సబ్‌) నాట్‌ (బి) తహిలా 72; రిచ (రనౌట్‌) 6; రాధ (సి) వాల్‌ (బి) జార్జియా 18; అరుంధతి (ఎల్బీ) (బి) గార్డ్‌నర్‌ 10; స్నేహ్‌ రాణా (స్టంప్డ్‌) హీలీ (బి) షుట్‌ 35; క్రాంతి (నాటౌట్‌) 8; రేణుక (సి) వాల్‌ (బి) గార్త్‌ 2; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (47 ఓవర్లలో ఆలౌట్‌) 369. వికెట్ల పతనం: 1–32, 2–85, 3–206, 4–216, 5–231, 6–261, 7–289, 8–354, 9–364, 10–369. బౌలింగ్‌: షుట్‌ 7–1–53–2; కిమ్‌ గార్త్‌ 9–1–69–3; గార్డ్‌నర్‌ 8–0–80–1; తహిలా 7–0–44–1; అలానా 7–0–60–0; గ్రేస్‌ హ్యారిస్‌ 2–0–20–1; జార్జియా 7–0–42–1.  

కొండంత లక్ష్యం ముందున్నా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ప్రతీక రావల్‌ (10), హర్లీన్‌ డియోల్‌ (11) విఫలమైనా... స్మృతి మంధాన చెలరేగిపోయింది. మూడో ఓవర్‌లో ‘హ్యాట్రిక్‌’ ఫోర్లు బాదిన మంధాన... ఐదో ఓవర్‌లో 6, 4 కొట్టింది. ఆరో ఓవర్‌లో 4, 4, 6.. తదుపరి ఓవర్‌లో మరో రెండు ఫోర్లతో 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. జోరుమీదున్న మంధానకు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ తోడవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో మంధాన 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. 

మరోవైపు 32 బంతుల్లో హర్మన్‌ హాఫ్‌సెంచరీ పూర్తైంది. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 204/2తో నిలిచింది. ఇక గెలుపు సులభమే అనుకుంటుండగా... హర్మన్‌ అవుటైంది. కాసేపటికి స్మృతి కూడా వెనుదిరగ్గా... రిచా ఘోష్‌ (6) దురదృష్టవశాత్తు రనౌటైంది. ఒక  దశలో టీమిండియా 289/7తో ఓటమి అంచులో నిలిచింది. ఈ సమయంలో స్నేహ్‌ రాణా అండతో దీప్తి శర్మ పోరాడింది. 48 బంతుల్లో 61 పరుగులకు చేయాల్సిన దశలో దీప్తి అవుట్‌ కావడంతో జట్టుకు పరాజయం తప్పలేదు.  

సూపర్‌ బ్యాటింగ్‌ ... 
ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు వన్డే సిరీస్‌ గెలవని భారత జట్టు... 
కొండంత లక్ష్యం ముందున్నా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ప్రతీక రావల్‌ (10), హర్లీన్‌ డియోల్‌ (11) విఫలమైనా... స్మృతి మంధాన చెలరేగిపోయింది. మూడో ఓవర్‌లో ‘హ్యాట్రిక్‌’ ఫోర్లు బాదిన మంధాన... ఐదో ఓవర్‌లో 6, 4 కొట్టింది. ఆరో ఓవర్‌లో 4, 4, 6.. తదుపరి ఓవర్‌లో మరో రెండు ఫోర్లతో 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. జోరుమీదున్న మంధానకు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ తోడవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో మంధాన 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు 32 బంతుల్లో హర్మన్‌ హాఫ్‌సెంచరీ పూర్తైంది. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 204/2తో నిలిచింది. ఇక గెలుపు సులభమే అనుకుంటుండగా... హర్మన్‌ అవుటైంది. కాసేపటికి స్మృతి కూడా వెనుదిరగ్గా... రిచా ఘోష్‌ (6) దురదృష్టవశాత్తు రనౌటైంది. ఒక  దశలో టీమిండియా 289/7తో ఓటమి అంచులో నిలిచింది. ఈ సమయంలో స్నేహ్‌ రాణా అండతో దీప్తి శర్మ పోరాడింది. 48 బంతుల్లో 61 పరుగులకు చేయాల్సిన దశలో దీప్తి అవుట్‌ కావడంతో జట్టుకు పరాజయం తప్పలేదు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement