
టాలీవుడ్ హీరో నితిన్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో వస్తోన్న రాబిన్‌హుడ్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కాంబోలో భీష్మ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డేవిడ్ వార్నర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నితిన్‌కు యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. రాబిన్‌హుడ్ టీమ్ నుంచి క్రికెట్ జట్టును తయారు చేయాలంటే ఎవరూ దేనికి సూట్ అవుతారో చెప్పాలంటూ హీరోను అడిగింది. దీనికి నితిన్ స్పందిస్తూ.. మా క్రికెట్ టీమ్‌లో శ్రీలీల బౌలర్.. ఎందుకంటే ఆమె వయ్యారంగా బౌలింగ్ చేస్తే ఎవరైనా అవుట్ కావాల్సిందే.. వికెట్ కీపర్‌గా మా మైత్రి నిర్మాత రవిశంకర్.. అంపైర్‌గా వెంకీ కుడుముల.. బ్యాట్స్‌మెన్‌గా నేనే.. మా టీమ్‌లో క్యాచ్‌లో పట్టేది నవీన్.. మా టీమ్ ఓనర్‌గా డేవిడ్ వార్నర్ అంటూ ఫన్నీగా తమ రాబిన్‌హుడ్ టీమ్‌ను ప్రకటించారు.