
టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ప్రముఖ ఆర్జే మహ్‌వశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి స్టేడియంలో కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ ఓ రేంజ్‌లో వైరలయ్యాయి. అంతేకాకుండా ఆర్జే మహ్‌వశ్ ఐపీఎల్‌లోనూ పంజాబ్ కింగ్స్ మద్దతుగా నిలిచింది. పంజాబ్ ఆడిన అన్ని మ్యాచ్‌లకు హాజరై సందడి చేసింది. దీంతో చాహల్‌తో డేటింగ్‌లో ఉన్నది నిజమేనంటూ పలు కథనాలొచ్చాయి. అయితే తనపై వస్తున్న రూమర్స్‌పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు ముద్దుగుమ్మ.
అయితే తాజాగా చాహల్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌లో అతని ప్రేమ, డేటింగ్ గురించి ప్రస్తావన వచ్చింది. తన రిలేషన్ షిప్ గురించి "కౌన్ హై వో లడ్కీ? అంటూ చాహల్‌ను ప్రశ్నించారు. దీనికి చాహల్ స్పందిస్తూ 'నాలుగు నెలల కిందటే.. ఇండియా మొత్తం తెలుసు' అంటూ మాట్లాడారు. ఇది చూసిన నెటిజన్స్ పరోక్షంగా ఆర్జే మహ్‌వశ్ అని క్లారిటీ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పేరు ప్రస్తావించకపోయినా నెట్టింట మాత్రం తెగ వైరల్‌గా మారింది. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సైతం చాహల్‌ను ఆట పట్టించారు.
కాగా.. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన మొదటి భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నారు. ఈ సంవత్సరం మార్చిలో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే ఆర్జే మహ్‌వశ్‌తో కలిసి చాహల్ మొదటిసారి ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్‌ల కనిపించారు. అప్పటి నుంచే ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా కపిల్ షోలో చాహల్ కామెంట్స్ చూస్తుంటే మహ్‌వస్‌తో డేటింగ్ కన్‌ఫామ్ చేసినట్లేనని నెటిజన్స్ భావిస్తున్నారు.