
అమెరికాలో జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో ఊహలకందని విధ్వంసం జరిగింది. ఎడిసన్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించే ఓ ఆటగాడు 78 బంతుల్లో 17 ఫోర్లు, 28 సిక్సర్ల సాయంతో 337.18 స్ట్రయిక్‌రేట్‌తో 263 పరుగులు (నాటౌట్) చేశాడు. క్రికెట్ చరిత్రలో బహుశా ఇంతటి విధ్వంసం ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. ఈ మ్యాచ్‌కు అధికారిక గుర్తింపు ఉందో లేదో తెలియదు కానీ.. సోషల్‌మీడియాలో మాత్రం ఈ వార్త హల్‌చల్ చేస్తుంది. ఇంతటి విధ్వంసానికి కారకుడు ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల కిందట అమెరికాలో క్రికెట్ లీగ్ ఆఫ్ న్యూజెర్సీ (CLNJ) అనే క్రికెట్ టోర్నీ (40 ఓవర్ల ఫార్మాట్) జరిగింది. ఇందులో భాగంగా ఎడిసన్ క్రికెట్ క్లబ్, ఈసీసీ షార్క్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రౌనక్ శర్మ (ఎడిసన్ క్రికెట్ క్లబ్) అనే ఆటగాడు సిక్సర్ల సునామీ సృష్టించి 78 బంతుల్లో అజేయమైన 263 పరుగులు చేశాడు. ఇందులో రౌనక్ తన తొలి సెంచరీని కేవలం 27 బంతుల్లోనే చేయడం మరో విశేషం.
Raunaq Sharma lit up club cricket with a jaw-dropping 263 off just 78 balls against ECC Sharks!🔥💯
His knock, in a 40-over clash, stands as one of the most explosive and highest-scoring innings in limited-overs cricket history. (official or unofficial) pic.twitter.com/3MuBcCQ2QW— CricTracker (@Cricketracker) July 3, 2025
ఇదే టోర్నీలో అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లోనూ రౌనక్ ఇదే తరహాలో విధ్వంసం సృష్టించాడు. NJ Lions CCతో జరిగిన మ్యాచ్‌లో 81 బంతుల్లో 15 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 209.88 స్ట్రయిక్‌రేట్‌తో 170 పరుగులు చేశాడు.
దీనికి ముందు జరిగిన మరో టోర్నీలో (WMCB T20 League Elite Division) కూడా రౌనక్ ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. ఓ మ్యాచ్‌లో 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్‌లు ఆడిన రౌనక్.. 220.65 స్ట్రయిక్‌రేట్‌తో 50.75 సగటున 406 పరుగులు చేశాడు.
33 ఏళ్ల రౌనక్ శర్మ భారత్‌లోని ముంబైలో జన్మించాడు. కుడి చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన ఆయన.. క్రికెట్ అవకాశాల కోసం యూఎస్‌ఏకు వలస వెళ్లాడు. ప్రస్తుతం రౌనక్ హ్యూస్టన్ స్టార్స్ అనే అమెరికన్ జట్టుకు ఆడుతున్నాడు. రౌనక్‌కు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో మంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు చిన్నతనంలో కలిసి ఆడారట.