భారీగా తగ్గిన పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్ల జీతాలు.. టీమిండియా ఆటగాళ్లతో పోలిస్తే..! | Babar Azam, Mohammad Rizwan Salary Revealed After Updated Pakistan Central Contract | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గిన బాబర్‌ ఆజమ్‌, రిజ్వాన్‌ జీతాలు.. టీమిండియా ఆటగాళ్లతో పోలిస్తే..!

Aug 19 2025 7:36 PM | Updated on Aug 19 2025 8:31 PM

Babar Azam, Mohammad Rizwan Salary Revealed After Updated Pakistan Central Contract

పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజమ్‌, మొహమ్మద్‌ రిజ్వాన్‌ నెల వేతనాలు భారీగా తగ్గాయి. ఈ ఇద్దరు తాజాగా ప్రకటించిన పాక్‌ సెంట్రల్‌ కాంట్రక్ట్‌ (2025-26) ఆటగాళ్ల జాబితాలో కేటగిరి-ఏ నుంచి కేటగిరి-బికి పడిపోయారు. ఇటీవలికాలంలో పేలవ ప్రదర్శనల కారణంగా వీరిద్దరు డిమోషన్‌కు గురయ్యారు.

కేటగిరి-బికి పడిపోయాక బాబర్‌, రిజ్వాన్‌ నెల జీతాల్లో కూడా భారీ మార్పు వచ్చింది. కేటగిరి-ఏలో ఉండగా వీరి జీతం భారత కరెన్సీ ప్రకారం రూ. 13.95 లక్షలుగా ఉండేది. కేటగిరి-బికి పడిపోయాక అది కాస్త రూ. 9.28 లక్షలకు పడిపోయింది.

భారత సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లతో పోలిస్తే ఈ వేతనం చాలా తక్కువ. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో అతి చిన్నదైన కేటగిరి-సిలో ఓ ఆటగాడికి నెలసరి వేతనం రూ. 8.3 లక్షలుగా ఉంది. అదే అత్యుత్తమమైన కేటగిరి-ఏ ప్లస్‌లో ఉన్న ఆటగాడికి రూ. 58.3 లక్షలుగా ఉంది.  

ఈ లెక్కన చూస్తే భారత అత్యుత్తమ ఆటగాడికి లభించే వేతనంలో పాక్‌ అత్యుత్తమ ఆటగాడికి కనీసం 20 శాతం​ కూడా లభించడం లేదు. 

పాక్‌ ఆటగాళ్లతో పోలిస్తే భారత ఆటగాళ్లకు లభించే మ్యాచ్‌ ఫీజులు కూడా చాలా ఎక్కువే. భారత ఆటగాడికి జీతంతో సంబంధం లేకుండా ఓ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడితే రూ. 15 లక్షలు, వన్డే ఆడితే రూ. 6 లక్షలు, టీ20 ఆడితే రూ. 3 లక్షలు లభిస్తాయి. అదే పాక్‌ ఆటగాళ్లకు టెస్ట్‌ మ్యాచ్‌కు 2 లక్షలు (భారత కరెన్సీలో), వన్డేకు రూ. లక్ష రూపాయలు, టీ20కి రూ. 60 నుంచి 80 వేలు లభిస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement