నా కుటుంబం నుంచీ రాజకీయాల్లోకి రావచ్చు..! | Kasthuri Raja shares why the name Dhanush K Raja means so much to him | Sakshi
Sakshi News home page

నా కుటుంబం నుంచీ రాజకీయాల్లోకి రావచ్చు..!

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 11:41 AM

Kasthuri Raja shares why the name Dhanush K Raja means so much to him

‘నా కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు’ అని సీనియర్‌ దర్శకుడు, నటుడు ధనుష్‌ దర్శకుడు సెల్వరాఘవన్‌  తండ్రి కస్తూరి రాజా పేర్కొన్నారు. ఈయన ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా రంగం నుంచి చాలా మంది రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. పోయస్‌ గార్డెన్‌లో నివశిస్తున్న  మీ కొడుకు, నటుడు ధనుష్‌ కూడా రాజకీయరంగప్రవేశం చేసే అవకాశం ఉందా ? అన్న విలేకరి ప్రశ్నకు దర్శకుడు కస్తూరి రాజా బదులిస్తూ  “చెన్నైలో పవర్‌పుల్‌ స్రాంతం పోయస్‌గార్డెన్‌. గోపాలపురం కూడా ఆ పక్కనే ఉంది. 

కలైంజ్ఞర్‌ కరుణానిధి జీవించిన ప్రాంతం అది. వెలుగు పుట్టిన స్థలం అది. ఇళయదళపతి కూడా ఆ ప్రాంతానికి రానున్నారని అని చెబుతున్నారు. రానీయండి. మాకు రాజకీయాలు  వద్దు. అయితే మా కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. వద్దని చెప్పడానికి మనమెవరం. నేను మాత్రం రాను. వయసు అయిపోయింది. నా కొడుకులు రావచ్చు, మనవళ్లు రావచ్చు. నేను తేని నుంచి చెన్నైకి రావడానికి రూ. 50 లేక కష్టపడ్డాను. 19 ఏళ్ల వయసులోనే నాకు పెళ్లి అయ్యింది. భార్య విజయలక్ష్మి ఆదరణతోనే చెన్నైకి వచ్చి కష్టపడి దర్శకుడిని అయ్యాను. 

తుళ్లువదో ఇళౖయె చిత్రం మా కుటుంబాన్ని మార్చేసింది. కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన తన పెద్ద కొడుకు సెల్వరాఘవన్‌ సినిమాల్లోకి వెళతానని ఆశపడితే ముందు చదువు పూర్తి చెయ్యి ,ఆ తరువాత చూద్దాం అని చెప్పాను. గోల్డ్‌ మెడల్‌ పొందిన అతను కాదల్‌ కొండేన్‌ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం మా కుటుంబ పరిస్థితి మార్చేసింది. ‘నా ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు చెన్నైలో ప్రముఖ డాక్టర్లుగా రాణిస్తున్నారు’ అని దర్శకుడు కస్తూరిరాజా పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement