నేపాలీ గ్యాంగ్స్‌పై ఆర్జీవీ కన్ను? | Ram Gopal Varma Focus On Nepali Gangs to Make Movie | Sakshi
Sakshi News home page

నేపాలీ గ్యాంగ్స్‌పై ఆర్జీవీ కన్ను?

Jun 13 2026 11:01 PM | Updated on Jun 13 2026 11:01 PM

Ram Gopal Varma Focus On Nepali Gangs to Make Movie

హైదరాబాద్‌తో పాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో నేపాలీ గ్యాంగ్స్ సృష్టించిన హత్యలు, దోపిడీలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన ఘటనతో ఈ నేపాలీ ముఠాల ఆగడాలు మరింతగా వెలుగులోకి వచ్చాయి.  

దాంతో ఈ పరిణామాలపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దృష్టి పడింది. ఎప్పుడూ రియల్ లైఫ్ కథలను తనదైన శైలిలో సినిమాగా మలచడంలో ఆసక్తి చూపుతుంటాడు వర్మ. తాజాగా ఈ దర్శకుడు నేపాలీ ముఠాల కథను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడని సమాచారం. దీనికి సంబంధించి సరైన పాయింట్ కోసం ఆయన వెతుకుతున్నాడని తెలుస్తోంది.  

గతేడాది తన సూపర్‌ హిట్‌ చిత్రం 'సత్య' సినిమాను మళ్లీ చూశాడు వర్మ. అనంతరం ఎందుకు దానిని బెంచ్‌మార్క్‌గా పెట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై తన ప్రతిభకు తగ్గ గొప్ప సినిమాలు తీస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అయితే ఆ తర్వాత తాను ప్రకటించిన 'సిండికేట్' సహా పలు ఇతర ప్రాజెక్టులు సైతం కార్యరూపం దాల్చలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement