ఎవరూ గుర్తుపట్టట్లేదు, ఇంకెందుకు బతికున్నా?: నటి ఆవేదన | Actress Anita Kanwal: why am I even Living?, I Did not Get Offers | Sakshi
Sakshi News home page

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ! నాపై నాకే అసహ్యం.. నేనెందుకూ పనికిరానా?: నటి

May 24 2026 1:15 PM | Updated on May 24 2026 3:23 PM

Actress Anita Kanwal: why am I even Living?, I Did not Get Offers

ఒకప్పుడు చేతినిండా అవకాశాలతో బిజీగా ఉండి ఇప్పుడు ఒక్క ఛాన్స్‌ కోసం చెప్పులరిగేలా తిరుగుతోంది బుల్లితెర అనిత కన్వాల్‌. ఒకప్పుడు సక్సెస్‌ను ఎంజాయ్‌ చేసిన నటి ఇప్పుడీ సైలెన్స్‌ను భరించలేకపోతోంది. బనేగి ఆప్నీ బాత్‌, సోన్‌పరి, సాసురాల్‌ జెండా పూల్‌ వంటి సీరియల్స్‌ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు బుల్లితెర ఇండస్ట్రీలో రాణించింది. 

అదే బాధ
తాజాగా ఆమె తన కష్టాలను ఓ ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టింది. అనిత కన్వాల్‌ మాట్లాడుతూ.. 'నలభై ఏళ్లు ఇక్కడ పని చేశానన్నమాటే కానీ నన్నెవరూ గుర్తుపట్టడం లేదు. అదే బాధగా అనిపిస్తూ ఉంటుంది. అయినా ఆడిషన్లకు వెళ్తున్నాను. నా పేరు అనిత కన్వాల్‌.. మీరెవరూ పుట్టకముందు నుంచే నేను ఈ ఇండస్ట్రీలో యాక్ట్‌ చేస్తున్నాను అని నా గురించి పరిచయం చేసుకోగానే అందరూ సైలెంట్‌ అయిపోతున్నారు. నా ఇగో పక్కనపెట్టి మరీ ఆడిషన్స్‌ ఇస్తున్నాను. 

నా టైం బాగోలేదేమో!
కానీ ఎవరూ నన్ను సెలక్ట్‌ చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. గతంలో టీవీలో ఎక్కువ కనిపించావు అన్న సాకు చెప్పేవారు. కానీ ఇప్పుడు టీవీలోనూ కనిపించక ఎనిమిదేళ్లవుతోంది. అయినా ఇప్పుడు బుల్లితెరపై పనిచేసేవాళ్లంతా ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ భాగమవుతున్నారుగా! బహుశా నా టైమ్‌ బాగోలేనట్లుంది. ఒకేసారి 13 సీరియల్స్‌ చేసిన రోజులున్నాయి. అలాంటి నన్ను అందరూ మర్చిపోయారు. 

ఎందుకు బతికున్నా?
అసలు నేనెందుకు బతికున్నాను? అని కూతురితో చెప్పుకుంటూ బాధపడ్డాను. టీవీలో ఎన్నో రకాల పాత్రలు చేశాను, ఎన్నో అవార్డులు పొందాను. కానీ, ఇప్పుడు ఖాళీ చేతులతో నిలబడ్డాను. నాపై నాకే అసహ్యం వేస్తోంది. నాకు వయసు పెరిగింది, ఒప్పుకుంటాను. కానీ నాకేమీ పడుచు పిల్ల పాత్ర ఇవ్వమని అడగడం లేదుగా.. 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలే ఇవ్వమంటున్నాను. నా వయసులో ఉన్నవాళ్లందరికీ పని దొరుకుతున్నప్పుడు నాకెందుకివ్వరు?

దేవుడిని తీసుకెళ్లిపోమంటున్నా..
నేను దేనికీ పనికారానా? అన్న ఆత్మనూన్యతా భావం నాలో ఎక్కువవుతోంది. అప్పుడప్పుడు ఆ దేవుడిని నన్ను తీసుకెళ్లిపోమని వేడుకుంటున్నాను. నేను చాలా ప్రొఫెషనల్‌. 40 ఏళ్ల కెరీర్‌లో ఎన్నడూ సెట్‌కు లేట్‌గా వెళ్లలేదు. మా అమ్మ చావుబతుకుల మధ్య ఉంటే కూడా నేను షూటింగ్‌ చేశాను. నా సీన్‌ పూర్తి చేసుకుని హాస్పిటల్‌ వెళ్లాను. అలాంటి నాకు ఇలాంటి దుస్థితి వచ్చింది' అని అనిత చెప్పుకొచ్చింది. ఈ నటి.. గీతాంజలి, కబీ హా కబీ నా, ముజ్సే దోస్తీ కరోగే, ద హ్యాంగ్‌మ్యాన్‌ వంటి చిత్రాల్లోనూ నటించింది.

చదవండి: ఇద్దరు భామలతో రామ్‌చరణ్‌ ఐటం సాంగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement