రూమర్స్‌ ఆపండి.. ప్రభాస్ సినిమాలపై టీమ్ క్లారిటీ | Prabhas Team Gives Clarity On Prabhas Upcoming Movies And Rumors, Says He Is Not Signing Any New Movies | Sakshi
Sakshi News home page

రూమర్స్‌ ఆపండి.. ప్రభాస్ సినిమాలపై టీమ్ క్లారిటీ

Jul 8 2026 11:09 PM | Updated on Jul 9 2026 10:24 AM

Prabhas Team Clarity on Prabhas Upcoming Movies and Rumors

ప్రభాస్ కొత్త సినిమాలపై పుకార్లు ఆపాలని అతడి టీమ్ స్పష్టత ఇచ్చింది. ప్రతి నెలా కొత్త దర్శకుల పేర్లు వినిపిస్తున్నా, ప్రస్తుతం ప్రభాస్ ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అతడి సన్నిహితులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికే ఆయన రెస్ట్ లేకుండా పని చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో మరిన్ని సినిమాలు ప్రకటించి తనపై ఒత్తిడి పెంచుకోవడం ఇష్టపడడంలేదని వారు తెలిపారు. 

అంతే కాదు హోంబలే ఫిలిమ్స్ మంచి స్టోరీలైన్‌తో ప్రభాస్‌ను సంప్రదించారట. దానికి కూడా ప్రభాస్ నో చెప్పేశాడట. దాని కోసం నిర్మాతలు రెండేళ్లు వెయిట్ చేస్తామని చెప్పినా కూడా ప్రభాస్ తన ప్రస్తుత ఫోకస్‌ను మార్చకుండా వారించాడని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు ఫౌజీ, స్పిరిట్, కల్కి-2, సలార్-2. ఈ నాలుగు సినిమాలపై ప్రభాస్ పూర్తి దృష్టి పెట్టనున్నాడు. అంతకుముందు నెల్సన్, లోకేశ్ కనగరాజ్ పేర్లు కూడా వినిపించినా, అవన్నీ పుకార్లేనని తన టీమ్ చెబుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement