రైల్లో న్యూస్ పేపర్ పరచుకుని పడుకున్నా: సోనూసూద్ | Sonu Sood Express His experience in Vande Bharar Train Journey | Sakshi
Sakshi News home page

Sonu Sood: 'రైల్లో న్యూస్ పేపర్ పరచుకుని పడుకున్నా'

Jun 13 2026 9:22 PM | Updated on Jun 13 2026 9:22 PM

Sonu Sood Express His experience in Vande Bharar Train Journey

బాలీవుడ్ నటుడు సోనూసూద్ భారతీయ రైల్వేపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వందేభారత్ రైల్లో ప్రయాణించిన ఆయన ఇండియన్ రైల్వేస్ అభివృద్ధిని ప్రశంసించారు. ఇంత నాణ్యమైన ప్రయాణాన్ని అందిస్తున్నందుకు భారతీయ రైల్వేకు ధన్యవాదాలు తెలిపారు. నాణ్యమైన ఆహారం అద్భుతమైన సిబ్బంది సేవలు ఉన్నాయని కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గతంలో తాను టికెట్ బుక్ చేసుకోవడానికే ఇబ్బందులు పడేవాడినని సోనూ సూద్ వెల్లడించారు. నాగ్‌పూర్ నుంచి ముంబయి వెళ్లేటప్పుడు ఈ పరిస్థితి ఎదురైందని తెలిపారు. తాను న్యూస్‌ పేపర్ కింద పరచుకుని రైళ్లలో ప్రయాణించిన రోజులు కూడా ఉన్నాయని సోనూసూద్ అన్నారు. భారతీయుల ప్రయాణంలో క్వాలిటీ చూసి గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రైల్వేశాఖను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోనూసూద్ మాటలతో రైల్వే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement