ఓటీటీలో దురంధర్‌-2 ప్రీమియర్ షో.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే...! | Ranveer Singh Dhurandhar 2 Movie OTT Release Date And Time Confirmed, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Ott: ఓటీటీలో దురంధర్‌-2 షో.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే...!

Jun 4 2026 4:33 PM | Updated on Jun 4 2026 5:20 PM

Ranveer Singh Dhurandhar 2 Ott Streaming Date and Time In India

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న దురంధర్‌-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ ‍స్పై యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ ఓవర్‌సీస్‌లో మాత్రమే స్ట్రీమింగ్ ‍అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విదేశాల్లోని ప్రేక్షకులను అలరిస్తోంది. మే 14వ తేదీ నుంచే ఓవర్సీస్‌లో అందుబాటులోకి వచ్చేసింది.

దీంతో ఇండియా ఫ్యాన్స్ సైతం దురంధర్‌-2 ఓటీటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దురంధర్‌ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచే జియో హాట్‌స్టార్ వేదికగా ప్రీమియర్ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

దురంధర్-2 కథేంటంటే?

రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్‌ పార్ట్‌ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్‌ పప్పు (అశ్విన్‌ ధర్‌)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్‌ పప్పుపై రెహమాన్‌ సోదరుడు ఉజెయిర్‌ బలోచ్‌(డానిష్‌) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని  భారత సీక్రెట్‌ ఏజెంట్‌ హమ్జా(రణ్‌వీర్‌ సింగ్‌) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అజయ్‌ సన్యాల్‌(మాధవన్‌) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్‌పై పాన్‌ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్‌ ఏజెంట్‌ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్‌ ’ ఎవరు? ఆపరేషన్‌ ధురంధర్‌ కోసం ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అజయ్‌ సన్యాల్‌.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న  జస్కరిత్ సింగ్ రంగీ(రణ్‌వీర్‌)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్‌ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement