సౌత్ సినీ పరిశ్రమపై తమన్నా విమర్శలు | Tamannaah criticizes the South film industry | Sakshi
Sakshi News home page

Tamannaah: సౌత్ సినీ పరిశ్రమపై తమన్నా విమర్శలు

Jun 23 2026 11:30 PM | Updated on Jun 23 2026 11:41 PM

Tamannaah criticizes the South film industry

సౌత్ సినీ పరిశ్రమలో దశాబ్దానికి పైగా అనుభవం సొంతం చేసుకున్న హీరోయిన్ తమన్నా. ఈమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.  తమన్నా మాట్లాడుతూ.. సౌత్ సినిమాలలో మహిళలను చూసే కోణంలో ఒకింత పురుషాధిక్యత కనిపిస్తుంది. హీరోయిన్లను గౌరవప్రదంగా కాకుండా ఎక్కువగా గ్లామర్ కోణంలోనే చూపిస్తారు. అయితే బాలీవుడ్‌లో మాత్రం నటన లేదా గ్లామర్ ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సౌత్‌లో ఈ రెండింటినీ సమతుల్యం చేయాల్సి వస్తుందని ఆమె అభిప్రాయపడింది.  

తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలోని చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే.. తమన్నా కెరీర్‌లో టాలీవుడ్, కోలీవుడ్ రెండింటిలోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. స్టార్ స్టేటస్, భారీ పారితోషికంతో పాటు అభిమానుల నుంచి ఆదరణ కూడా వచ్చింది. ఇవన్నీ ఆమెకు దక్షిణాదే ఇచ్చాయి. కానీ ఇప్పుడు తనకు అవకాశాలు తగ్గడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని కొందరు విమర్శిస్తున్నారు. గతంలో రాధికా ఆప్టే, తాప్సీ పన్ను వంటి హీరోయిన్లు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమన్నా కూడా అదే జాబితాలో చేరిందని సినీ వర్గాలు అంటున్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement