కృతీ... నువ్వు సూపర్‌ | Kriti Sanon protected Rashmika Mandanna | Sakshi
Sakshi News home page

కృతీ... నువ్వు సూపర్‌

Jun 15 2026 12:31 AM | Updated on Jun 15 2026 12:31 AM

Kriti Sanon protected Rashmika Mandanna

రష్మికకు సహాయం చేసిన కృతి

అభిమాన తారలను చూడగానే ఫ్యాన్స్‌కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఒక్కోసారి ఆ అభిమానమే స్టార్స్‌ని ఇబ్బందులపాలు చేస్తుంది. షాహిద్‌ కపూర్, కృతీ సనన్, రష్మికా మందన్నా అలానే ఇబ్బందిపడ్డారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో రూపొందిన హిందీ చిత్రం ‘కాక్‌టెయిల్‌ 2’ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఈ ముగ్గురూ జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే పుణెలోని ఓ మాల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లా జరిగిన మ్యూజికల్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. వేదికపై ముగ్గురూ డ్యాన్స్‌ చేశారు.

అలాగే అక్కడి లోకల్‌ స్నాక్‌ అయిన ‘వడ పావ్‌’ తిన్నారు. అంతా బాగానే జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరైన వీక్షకుల్లో కొందరు కనబర్చిన అత్యుత్సాహంతో అనుకున్న సమయానికన్నా నిర్వాహకులు కాస్త ముందుగానే వేడుకను ముగించాల్సి వచ్చింది. షాహిద్, కృతి, రష్మికలను అక్కణ్ణుంచి పంపించే క్రమంలో అభిమానులు బారికేడ్లను దాటుకుని ముందుకు దూసుకు రావడంతో కంట్రోల్‌ చేయడానికి సెక్యూర్టీ చాలా ఇబ్బందిపడ్డారు.

ఎలాగైతేనేం ముగ్గుర్నీ క్షేమంగా అక్కణ్ణుంచి పంపించారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే... రష్మిక చుట్టూ తన చేతులు వేసి, కృతి ఆమెకు హెల్ప్‌ చేయడం. నిజానికి కృతీకి కూడా బోలెడంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఒక వ్యక్తి ఆమెను తాకడానికి కూడా ట్రై చేశాడట.

అయితే రష్మిక భయపడినట్లు కనిపించడంతో ఆమెకు రక్షణగా కృతి తన చేతులను ఆమె చుట్టూ వేశారని వీడియో స్పష్టం చేస్తోంది. ఇలా సహ నటికి సహాయం చేయడం పట్ల ‘కృతీ... నువ్వు సూపర్‌’ అంటూ కృతీ సనన్‌ని అందరూ అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే... దూసుకొచ్చినవారిని షాహిద్‌ నెట్టేయడం వీడి యోలో కనిపించింది. ఆయన దుస్తులు కూడా చిరిగాయని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement