66 హార్డ్ డిస్క్‌లు, లక్షల విలువైన డేటా మాయం : షాక్‌లో డైరెక్టర్లు | Zoya Akhtar office 66 hard disks with unreleased OTT content data theft | Sakshi
Sakshi News home page

66 హార్డ్ డిస్క్‌లు, లక్షల విలువైన డేటా మాయం : షాక్‌లో డైరెక్టర్లు

May 26 2026 5:16 PM | Updated on May 26 2026 5:33 PM

Zoya Akhtar office 66 hard disks with unreleased OTT content data theft

ప్రముఖ చలనచిత్ర దర్శకులు జోయా అక్తర్, రీమా కాగ్తీలకు  భారీ షాక్‌ తగిలింది.  వీరి నిర్మాణ సంస్థ ‘టైగర్ బేబీ’ (Tiger Baby)లో విలువైన డేటాను తస్కరించిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ సంస్థ కార్యాలయం నుండి, ముఖ్యమైన సినిమా , OTT సంబంధిత డేటా నిక్షిప్తమై ఉన్న 66 హార్డ్ డిస్క్‌లు దొంగతనం ఆరోపణలపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా షాకింగ్ నిజాలు తెలిశాయి. 

ఈ డిస్క్‌ల మార్కెట్ విలువ సుమారు రూ. 13 లక్షలు ఉంటుందని అంచనా.  ఇంకా  విడుదల కాని సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన 2026 మే నెలలో 66 హార్డ్ డిస్క్‌లు దొంగతనానికి గురయ్యాయి. ఈ డిస్క్‌లలో 16TB నుండి 72TB వరకు నిల్వ సామర్థ్యం ఉంటుందని వారి ఫిర్యాదు ద్వారా తెలుస్తోంది. ఈ ఫుటేజ్‌తోఆటు, రఫ్ ఎడిట్స్, యాడ్ ప్రాజెక్ట్‌లు, పోస్ట్-ప్రొడక్షన్ మెటీరియల్స్ , ముగిసిన సినిమాల బ్యాకప్ డేటా ఉన్నాయి.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ‘మేడ్ ఇన్ హెవెన్’ (Made in Heaven) సిరీస్, అలాగే 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఘోస్ట్ స్టోరీస్’ (Ghost Stories) ప్రాజెక్ట్‌లకు సంబంధించిన డేటా కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.వీటిల్లో కొన్ని డిస్క్‌లు గ్రే మార్కెట్‌లో విక్రయించగా,  గోప్యమైన డేటా లీక్ అయ్యే అవకాశాలపై నిపుణుల విచారణ చేపట్టారు.

ఇంటిదొంగల పనే 
మే 21న ఆఫీస్ సిబ్బంది పని కోసం హార్డ్ డిస్క్‌లను వెతకగా అవి కనిపించలేదు. కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ,  హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న మెహజబీన్ ముస్తాక్ షేక్ అంతర్గతంగా తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. స్టోరేజ్ క్యాబినెట్‌లో ఉన్న అసలైన హార్డ్ డిస్క్‌లను దొంగిలించి, వాటి స్థానంలో ఖాళీ లేదా పాడైపోయిన డబ్బాలను ఉంచినట్లు గుర్తించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈకేసులో ఇద్దరు నిందితులను  పోలీసులు అరెస్ట్‌ చేశారు.  మొదటివాడు ఆ స్టోరేజ్ క్యాబినెట్‌ను పర్యవేక్షించే ఆఫీస్ ఉద్యోగే ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. గ్రే మార్కెట్ (Grey Market)లో ఒక్కో హార్డ్ డిస్క్‌ను రూ. 15,000 నుండి రూ. 20,000 లకు విక్రయించినట్లు తెలిపాడు. ఇక రెండో నిందితుడు బోరివలికి చెందిన ఒక వ్యక్తి ఈ డిస్క్‌లను కొనుగోలు చేయగా, పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. కోర్టు వీరికి మే 29 వరకు పోలీస్ కస్టడీ విధించింది.

సైబర్ నిపుణుల దర్యాప్తు
దొంగిలించబడిన వాటిలో 24 హార్డ్ డిస్క్‌లను నిందితుడు అమ్మేయగా, మిగిలిన వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, హార్డ్‌వేర్ దొరకడం కంటే కూడా అందులోని రహస్య డేటాను ఎవరైనా కాపీ చేశారా? లేదా ఆన్‌లైన్‌లో ఎక్కడైనా లీక్ చేశారా? అనే కోణంలో సైబర్ క్రైమ్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. వినోద పరిశ్రమలో డేటా సెక్యూరిటీ (సమాచార భద్రత) ఎంత ముఖ్యమనే దానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement