వారణాసి తర్వాత గ్లోబల్ స్టార్‌గా మహేష్.. తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో? | Mahesh Babu next Movie project will be with whom after Rajamouli Varanasi | Sakshi
Sakshi News home page

వారణాసి తర్వాత గ్లోబల్ స్టార్‌గా మహేష్.. తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో?

Jun 27 2026 11:32 PM | Updated on Jun 28 2026 5:32 AM

Mahesh Babu next Movie project will be with whom after Rajamouli Varanasi

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకోవడంతో ఆయన చేసే తదుపరి సినిమాలపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. మరో నాలుగు నెలల్లో వారణాసి మేజర్ షెడ్యూల్స్ పూర్తవుతాయి. అనంతరం మహేష్ ఎలాంటి విరామం తీసుకోకుండా వెంటనే కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాలని నిర్ణయించుకున్నారని సమాచారం.  

సాధారణంగా పెద్ద సినిమాలు పూర్తయిన తర్వాత హీరోలు కొంతకాలం విశ్రాంతి తీసుకుంటారు. మహేష్ కూడా అంతే. తనకు సమయం దొరికితే వెంటనే తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తారు. అక్కడే కొంతకాలం విశ్రాంతి తీసుకుంటారు. కానీ మహేష్ ఈసారి భిన్నమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారట. వారణాసి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత కూడా ఆయన బ్రేక్ తీసుకోకుండా కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోని పలువురు క్రేజీ దర్శకులు మహేష్ కోసం సరికొత్త కథలను సిద్ధం చేసుకుని సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు దర్శకులు మహేష్‌కు లైన్స్ వినిపించినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. వాటిలో కమర్షియల్ ఎంటర్‌టైనర్ల నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ కథల వరకు మహేష్ దగ్గరకు వచ్చాయని తెలుస్తోంది.  

ఇప్పుడు మహేష్ చేయాల్సిన పని నెక్స్ట్ సినిమా కోసం వీరిలో ఒక దర్శకుడిని ఫైనల్ చేయడమే. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. అందుకే కథల ఎంపికలో మహేష్ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. ఆయన ఇమేజ్‌కు సరిపోయేలా, గ్లోబల్ రీచ్ వచ్చేలా ఉండే కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే వారణాసితో మహేష్ గ్లోబల్ స్టార్ అవుతారని అంచనా. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రాలు కూడా గ్లోబల్ రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement