పెళ్లి తేదీ ఫిక్స్‌? | Actor Aamir Khan is preparing to marry for the third time | Sakshi
Sakshi News home page

పెళ్లి తేదీ ఫిక్స్‌?

Jun 4 2026 5:52 AM | Updated on Jun 4 2026 4:54 PM

Actor Aamir Khan is preparing to marry for the third time

బాలీవుడ్‌లో ప్రస్తుతం జోరుగా ప్రచారం అవుతున్న వార్తల్లో ఆమిర్‌ ఖాన్‌–గౌరీ స్ప్రాట్‌కి సంబంధించిన పెళ్లి వార్త ఒకటి. చెప్పాలంటే ఇదే హాట్‌ టాపిక్‌. గత ఏడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో జరిగిన ప్రీ–బర్త్‌డే వేడుకలో ఆమిర్‌ ఖాన్‌ మొదటిసారిగా గౌరీని మీడియాకు పరిచయం చేశారు. దాంతో 47 ఏళ్ల గౌరీ స్ప్రాట్, ఆమిర్‌ ప్రేమలో ఉన్నారన్న విషయం స్పష్టమైంది. 

ఇప్పుడు తమ ప్రేమను వివాహ బంధం వరకూ తీసుకెళ్లాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నారట. జూన్ 5న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఈ వేడుక చాలా నిరాడంబరంగా జరగనుందని టాక్‌. రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకోవాలనుకుంటున్నారట. ముంబైలోని ఆమిర్‌ నివాసంలో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత  సన్నిహితుల మ«ధ్య ఈ వివాహం జరగనుందని భోగట్టా. ఆమిర్‌ ఖాన్‌ స్నేహితులు, బాలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌ సల్మాన్‌ ఖాన్, షారుక్‌ ఖాన్‌ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ఆమిర్‌కి ఇది మూడో వివాహం అని తెలిసిందే. 

గతంలో రీనా దత్తాతో వివాహం జరగ్గా, వారికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత కిరణ్‌ రావును పెళ్లి చేసుకున్నారు ఆమిర్‌. ఈ దంపతులకు ఆజాద్‌ అనే కుమారుడు ఉన్నాడు. ఆమిర్, కిరణ్‌ రావు 2021లో తమ విడాకులను ప్రకటించారు. ఇక గౌరీ స్ప్రాట్‌కు ఇది రెండో వివాహం. గత వివాహం ద్వారా క్విన్‌ అనే ఏడేళ్ల కుమారుడు ఆమెకు ఉన్నాడు. ఇదిలా ఉంటే... ఇటీవల (మార్చి 14) తన 61వ పుట్టినరోజు వేడుకను గౌరీ స్ప్రాట్‌తో కలిసి చేసుకున్నారు ఆమిర్‌. ఈ వేడుకకు ఆయన మాజీ భార్యలు రీనా, కిరణ్‌ కూడా హాజరు కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement