నర్సుగా కంగనా రనౌత్.. భారత్ భాగ్య విధాత ట్రైలర్‌ చూశారా? | Kangana Ranaut Latest Movie Bharat Bhhagya Viddhaata trailer out now | Sakshi
Sakshi News home page

Bharat Bhhagya Viddhaata Trailer: కనిపించని హీరోలు.. భారత్ భాగ్య విధాత ట్రైలర్‌ రిలీజ్

Jun 2 2026 7:50 PM | Updated on Jun 2 2026 8:10 PM

Kangana Ranaut Latest Movie Bharat Bhhagya Viddhaata trailer out now

బాలీవుడ్ లేడీ స్టార్ కంగనా రనౌత్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ భారత్ భాగ్య విధాత(ది అన్‌సీన్‌ హీరోస్). ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ మూవీని మణికర్ణిక ఫిల్మ్స్, పరమాన్స్ క్రియేషన్స్, యునోయా ఫిల్మ్స్, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో భారత్ భాగ్య విధాత ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ కథ నర్సుల జీవితం ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కంగనా నర్సు పాత్రలో కనిపించనుంది. 26/11 టెర్రరిస్ట్‌ ఎటాక్‌ జరిగిన సమయంలో నర్సుల పోరాటం గురించే ఈ మూవీలో చూపించనున్నట్లు ట్రైలర్‌లోనే అర్థమవుతోంది. కాగా..  ఈ చిత్రంలో గిరిజా ఓక్ గాడ్‌బోలే, స్మితా తాంబే, సుహిత తట్టే, ఆశా షెలార్, ప్రియా బెర్డే, ఈషా డే, రసిక అఘాసే, అమృత నామ్‌దేవ్, ఆదిత్య మిశ్రా, జాహిద్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement