ప్రముఖ గాయని సుమన్‌ ఇక లేరు | Singer Suman Kalyanpur Passed Away at 89 | Sakshi
Sakshi News home page

సంగీత ప్రపంచంలో విషాదం.. సింగర్‌ సుమన్‌ కన్నుమూత

Jun 1 2026 8:30 AM | Updated on Jun 1 2026 7:34 PM

Singer Suman Kalyanpur Passed Away at 89

ప్రముఖ గాయని సుమన్‌ కల్యాణ్‌పూర్‌ (89) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం (మే 31న) సాయంత్రం ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. చివరి రోజుల్లో ఆమె తన పాటలు వింటూ కాలం గడిపారు. గాయని మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, సినీతారలు సంతాపం ప్రకటిస్తున్నారు.

ఎవరీ గాయని?
సుమన్‌ కళ్యాణ్‌పూర్‌ 1937 జనవరి 28న ఢాకాలో జన్మించారు. 1950ల ప్రారంభంలో సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. మరాఠి, హిందీతో పాటు పలు భాషల్లోనూ పాటలు ఆలపించారు. నా నా కర్‌తే ప్యార్‌ తుమ్హీసే కర్‌ బైఠే.. (బాత్‌ ఏక్‌ రాత్‌ కీ మూవీ), ఆజ్‌ కల్‌ తేరే మేరె ప్యార్‌కే చర్చే హర్‌ జబాన్‌ పర్‌ (బ్రహ్మచారి), తుమ్నే పుకారా ఔర్‌ హమ్‌ చలే ఆయే (రాజ్‌కుమార్‌) వంటి ఎన్నో గీతాలకు ఆమె ప్రాణం పోశారు. ఆమె  గొంతు లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ను పోలి ఉండటంతో అభిమానులు ఆమెను మరో లత అని పిల్చుకునేవారు. ఆరు దశాబ్దాలుగా సంగీత ప్రపంచానికి సేవలందించిన సుమన్‌ను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement