ముచ్చటగా మూడోసారి.. ప్రియురాలితో అమిర్ ఖాన్ పెళ్లి..! | Aamir Khan to marry Gauri Spratt on this date registered marriage | Sakshi
Sakshi News home page

Aamir Khan: ఆరుపదుల వయసు.. ప్రియురాలితో పెళ్లి.. డేట్ ఫిక్స్.!

Jun 3 2026 5:04 PM | Updated on Jun 4 2026 4:54 PM

Aamir Khan to marry Gauri Spratt on this date registered marriage

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆరు పదుల వయసులో తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను పెళ్లాడనున్నారు. అయితే ఈ పెళ్లిని చాలా సింపుల్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్డ్ మ్యారేజ్  చేసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈనెల జూన్ 5న వీరిద్దరు రిజిస్టర్ మ్యారేజ్‌ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అమిర్ ఖాన్‌ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట ఇటీవలే తమ బంధాన్ని అఫీషియల్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వీరిద్దరు ఇప్పటికే తమ పెళ్లికి ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. వీరి పెళ్లికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హాజరయ్యే అవకాశముందని ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. ఈ జంట ఇరు కుటుంబాల మద్దతుతోనే పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

కాగా.. ఆమిర్ ఖాన్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి  ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత కిరణ్ రావుతో 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్‌లో ఉన్న అమిర్ ఖాన్.. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జూలై 5న జరిగిన రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోనున్నారు. గతేడాది ముంబయిలో జరిగిన ఒక బర్త్‌డే వేడుకల్లో తన ప్రియురాలు గౌరీని  పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గౌరీ స్ప్రాట్‌కు ఇప్పటికే క్విన్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement