అతన్ని కొట్టాను..ఇప్పటికీ బాధపడుతున్నా: అలియా భట్‌ | Alia Bhatt Reveals Biggest Regret While Shooing Alpha Movie | Sakshi
Sakshi News home page

అతన్ని కొట్టాను..ఇప్పటికీ బాధపడుతున్నా: అలియా భట్‌

Jun 26 2026 4:21 PM | Updated on Jun 26 2026 4:29 PM

Alia Bhatt Reveals Biggest Regret While Shooing Alpha Movie

సినిమాల్లో ఒకప్పుడు యాక్షన్‌ సన్నివేశాలు కేవలం హీరోలు మాత్రమే చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. హీరోయిన్లు సైతం గాల్లోకి ఎగిరి ఫైట్‌ చేస్తున్నారు. రెండు చేతుల్లో గాన్స్‌ పట్టి ఫైర్‌ కూడా చేస్తున్నారు. అలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే అందాల భామ అలియా భట్‌ కూడా హై-వోల్టేజ్ యాక్షన్‌ థ్రిల్లర్‌తో అలరించడానికి రెడీ అవుతుంది. ఆమె ప్రధాన పాత్రలో, శివ్‌ రావేల్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆల్ఫా’. జులై 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా.. ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఈ సినిమాలోని యాక్షన్‌ సీన్ల కోసం ప్రాక్టీస్‌ చేస్తున్న సయమంలో ఓ కొరియోగ్రాఫర్‌ని కొట్టానని చెప్పింది. అలా కొట్టినందుకు ఇప్పటికీ బాధ పడుతున్నానని అలియా తెలిపింది.  

‘ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో అనుకోకుండా అతన్ని కొట్టాను. వెంటనే సారీ కూడా చెప్పాను. కానీ నా వల్ల ఒకరికి దెబ్బ తగిలినందుకు చాలా బాధేసింది. ఇప్పటికీ అది గుర్తొచ్చినప్పుడల్లా బాధపడతాను. యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరపై సహజంగా చూపించడానికే అలా ప్రాక్టీస్‌ చేశాం. ఆల్ఫాలో యాక్షన్‌ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఈ చిత్రం ఇచ్చింది’ అని అలియా చెప్పకొచ్చింది. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన బాబీ డియోల్‌ కూడా అలియా యాక్షన్‌ సీన్స్‌ చూసి భయపడిపోయానని చెప్పాడు. అలియా చాలా సన్నగా ఉంటారని.. ఎక్కడ దెబ్బ తగులుతుందోననే భయంతో జాగ్రత్తగా షూటింగ్‌ చేశామని ఆయన చెప్పుకొచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement