ఓటీటీల్లో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తుంటాయి. వీటిలో ఆడియన్స్ ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ లాంటి మూవీస్‌ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగానే ప్రతివారం బోలెడ్ చిత్రాలు, సిరీస్‌లు రానే వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ కీలక పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'రాఖ్'. ఈ వెబ్ సిరీస్‌కు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో ఫజల్ పోలీస్ యూనిఫాంలో కనిపించగా.. అతనిముందు ఓ శవం ఉన్న కొత్త పోస్టర్‌ను ఈ సిరీస్‌పై ఆసక్తిని మరింత పెంచేసింది. పాతిపెట్టిన నిజాలు ఎప్పుడూ తిరిగి బయటపడతాయి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.
'రాఖ్' అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సిరీస్. ఇద్దరు టీనేజర్లు అదృశ్యం కావడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ సంఘటన ఒక అన్యోన్యమైన కుటుంబాన్ని తీవ్రంగా, మానసిక వేదనకు గురిచేస్తుంది. అంతేకాకుండా మొత్తం నగరాన్ని ఆందోళనకు గురవుతుంది. ఈ కేసును చేధనే లక్ష్యంగా దర్యాప్తు కోణంలో ఈ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు ఆయుష్ త్రివేది డైలాగ్స్ అందించగా.. ఎండెమోల్ షైన్ ఇండియా బ్యానర్‌పై దీపక్ ధర్, రిషి నేగి, మృణాలిని జైన్, శ్యామ్ రాఠీ నిర్మించారు.


