పెళ్లి వేడుకలో దీపిక- రణ్‌వీర్ సింగ్ జంట.. పిక్స్ వైరల్ | Deepika holds back tears Ranveer enjoys in family wedding | Sakshi
Sakshi News home page

Deepika-Ranveer: పెళ్లి వేడుకలో మెరిసిన దీపిక- రణ్‌వీర్.. పిక్స్ వైరల్

Jun 2 2026 5:29 PM | Updated on Jun 2 2026 6:03 PM

Deepika holds back tears Ranveer enjoys in family wedding

బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తమ బంధువుల పెళ్లి వేడుకలో వీరిద్దరు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో దీపికా భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తోంది. రణవీర్ ఎరుపు రంగు కుర్తా పైజామాలో కనిపించగా.. దీపిక కలర్‌ఫుల్ సంప్రదాయ చీరలో మెరిసింది.  ఇది రణ్‌వీర్ సింగ్ కజిన్‌ వెడ్డింగ్‌ అని తెలుస్తోంది. 

దీపిక- రణ్‌వీర్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే వీరిద్దరు తమ రెండో బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. ఇటీవలే తమ కుమార్తె దువాతో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ జంట నవంబర్ 2018లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లకు 2024లో దువాకు స్వాగతం పలికారు. ఇక సినిమాల విషయానికొస్తే దీపిక అట్లీ దర్శకత్వం వహిస్తోన్న 'రాకా' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు, రణ్‌వీర్ సింగ్ సైతం కల్యాణి ప్రియదర్శన్‌తో కలిసి జాంబీ అడ్వెంచర్ చిత్రం 'ప్రళయ్'లో నటించనున్నారు. అయితే 'డాన్ 3' నుంచి రణ్‌వీర్ తప్పుకుంటున్నారనే వార్తలొచ్చాయి. ఇటీవలే దురంధర్‌ చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్‌ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement