వాస్తవ ఘటనలతో... | Kangana Ranaut Bharat Bhagya Vidhata Poster of released | Sakshi
Sakshi News home page

వాస్తవ ఘటనలతో...

May 29 2026 5:52 AM | Updated on May 29 2026 5:52 AM

Kangana Ranaut Bharat Bhagya Vidhata Poster of released

బాలీవుడ్‌ నటి,  ఎంపీ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన  చిత్రం ‘భారత్‌ భాగ్యవిధాత’. మనోజ్‌ తపాడియా దర్శకత్వం వహించారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో మణికర్ణిక ఫిల్మ్స్‌– పరమహంస్‌ క్రియేషన్స్ పై రూపొందిన ఈ మూవీ జూన్‌ 12న విడుదల కానుంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 

మంటల్లో చిక్కుకున్న వారిని కంగనా కాపాడుతున్నట్లు ఈ పోస్టర్‌లో ఉంది. భారతదేశ చరిత్రలో 2008లో జరిగిన విషాదకరమైన 26/11 ముంబై ఉగ్రదాడుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కామా అండ్‌ ఆల్‌బ్లెస్‌ హాస్పిటల్‌లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో హెడ్‌ నర్స్‌ పాత్రలో కంగనా రనౌత్‌ నటించారు. ఉగ్రదాడుల సమయంలో ఆసుపత్రిలోని సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులను ఎలా రక్షించారు... అనేది ఆమె పాత్ర ద్వారా చూపించబోతున్నారు మనోజ్‌ తపాడియా. 

Advertisement
 
Advertisement
Advertisement