నా పోస్ట్‌ని బ్రేకింగ్‌ న్యూస్‌ చేశారు.. అమ్మ కంగారుపడుతోంది : సల్మాన్‌ ఖాన్‌ | Salman Khan Clarity On His Lonely Post | Sakshi
Sakshi News home page

అమ్మ కూడా కంగారుపడుతోంది.. వైరల్‌ న్యూస్‌పై సల్మాన్‌ క్లారిటీ

May 19 2026 11:33 AM | Updated on May 19 2026 11:38 AM

Salman Khan Clarity On His Lonely Post

నిన్నంటి నుంచి సల్మాన్‌ ఖాన్‌కు సంబంధించిన ఓ న్యూస్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆయన షర్ట్‌లెస్‌ ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ఒంటరితనం గురించి రాసుకొచ్చాడు. ‘ఒంటరిగా ఉండటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి 'అలోన్', రెండోది 'లోన్లీ'. 'అలోన్'గా ఉండటం అనేది మన ఇష్టపూర్వక ఎంపిక. కానీ, ఎవరూ మనతో ఉండటానికి ఇష్టపడనప్పుడు వచ్చేది 'లోన్లీ'నెస్... ఇక దీని తర్వాత ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టడంతో అది క్షణాల్లో వైరల్‌ అయిపోయింది. 

‘సల్మాన్‌ ఖాన్‌కి ఏమైంది?’, ఒంటరిగా ఉన్నానని ఎందుకు ఫీల్‌ అవుతున్నాడంటూ ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ వైరల్‌ న్యూస్‌పై సల్మాన్‌ ఖాన్‌ స్పందించాడు. సోషల్‌ మీడియాలో తాను పెట్టిన పోస్ట్‌.. వైరల్‌ అయిన న్యూస్‌  చూసి తన తల్లి కంగారు పడిందని, అయితే తాను మాత్రం చాలా హ్యాపీగానే ఉన్నానని చెప్పాడు.

‘అరే యార్‌.. నేను నా గురించి మాట్లాడలేదు. అయినా.. ఇంత పెద్ద కుటుంబం, ఇంతమంది ఫ్రెండ్స్‌ ఉన్నప్పుడు నేను ఎలా ఒంటరివాడిని అవుతాను? మీ అందరి ప్రేమాభిమానాలు నాకు తోడుగా ఉంటే నేను ఒక్కడినే అనే భావన నాలో ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు చుట్టూ జనాలు ఉండటం వల్ల విసుగ్గా అనిపిస్తుంది. అందుకే నా కోసం కొంచెం సమయం కేటాయించుకోవాలనిపించిందంతే. దాన్ని మీరంతా హైలైట్‌ చేశారు. కనీసం ఫొటో కూడా పెట్టకుండానే మీరు దీన్ని బ్రేకింగ్ న్యూస్ చేసేశారు. మా అమ్మ కూడా నన్ను ‘ఏమైంది నాన్న?’ అని అడుగుతోంది. 

రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్’ అని ఆయన ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీంతో సల్మాన్‌ ఖాన్‌కి ఏం కాలేదనే విషయం తెలిసి.. ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన ‘మాతృభూమి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement