ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్.. కాక్‌టెయిల్-2 ట్రైలర్ చూశారా? | Shahid Kapoor Kriti Sanon Rashmika Mandanna Cocktail 2 Official Trailer | Sakshi
Sakshi News home page

Cocktail 2 Official Trailer: ఇద్దరు హీరోయిన్లతో ట్రయాంగిల్ లవ్.. కాక్‌టెయిల్-2 ట్రైలర్ రిలీజ్

Jun 2 2026 4:46 PM | Updated on Jun 2 2026 4:52 PM

 Shahid Kapoor Kriti Sanon Rashmika Mandanna Cocktail 2 Official Trailer

రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న లేటేస్ట్ బాలీవుడ్ మూవీ కాక్‌టెయిల్-2. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతి సనన్ మరో హీరోయిన్‌గా మెప్పించనుంది. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా కాక్‌టెయిల్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో సీన్స్‌ ఫుల్ రొమాంటిక్‌గా కనిపిస్తున్నాయి. ఇద్దరితో షాహిద్ కపూర్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీ జూన్‌ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో  రిలీజ్ కానుంది.  దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన 'కాక్‌టెయిల్' (2012) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement