రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Ayushmann Khurrana film Mupapa to release on February 19 2027 | Sakshi
Sakshi News home page

రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Jul 2 2026 3:49 AM | Updated on Jul 2 2026 3:49 AM

Ayushmann Khurrana film Mupapa to release on February 19 2027

బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా నటిస్తున్న తాజా చిత్రం ‘ముపాపా’. సమీర్‌ సక్సేనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్, పోషమ్‌ పా పిక్చర్స్‌ బ్యానర్స్‌పై యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సీఈఓ అక్షయ్‌ విదాని ఈ మూవీ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాని 2027 ఫిబ్రవరి 19న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ బుధవారం ప్రకటించారు.    ‘‘ముపాపా’ వినూత్నమైన థియేట్రికల్‌ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియన్స్‌కి కొత్త విజువల్‌ అనుభూతిని అందిస్తుంది. ‘కాలా పానీ, మామ్లా లీగల్‌ హైస’ వంటి ప్రేక్షకాదరణ పొందిన సినిమాల్లో భాగమైన పోషమ్‌ పా పిక్చర్స్‌ భాగస్వాములు సమీర్‌ సక్సేనా, బిస్వపతి సర్కార్, సౌరభ్‌ ఖన్నా, అమిత్‌ గోలాని    ‘ముపాపా’ చిత్రంలో భాగమయ్యారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement