బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2. గతేడాది డిసెంబర్‌లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే వచ్చిన ఈ సినిమా సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ.1790 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జూన్ 5న స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రీమింగ్‌కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికిపైగా వీక్షించారని ఓటీటీ సంస్థ ప్రకటించింది.
అయితే తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలోనూ సందడి చేయనుంది. ప్రస్తుతం ఓవర్‌సీస్ ఆడియన్స్‌కు మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. మే 14వ తేదీ నుంచే ఓవర్సీస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఇండియాలోని ప్రేక్షకులకు సైతం నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ నెల 19 నుంచి ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వీడియోను రిలీజ్ చేసింది. అంటే ఈ శుక్రవారం నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా దురంధర్-2 సందడి చేయనుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ కీలక పాత్రలు పోషించారు.
19 June, on Netflix in Hindi, Tamil, Telugu, Kannada and Malayalam.
— Netflix India (@NetflixIndia) June 17, 2026


