డోలారే.. సాంగ్‌ షూటింగ్‌లో మాధురి ప్రెగ్నెంట్‌? | Madhuri Dixit Responds being Pregnant while filming Dola Re Song in Devdas Movie | Sakshi
Sakshi News home page

అప్పుడు 4 నెలల ప్రెగ్నెంట్‌? మీరే లెక్క వేయండన్న హీరోయిన్‌

Jun 1 2026 12:11 PM | Updated on Jun 1 2026 7:48 PM

Madhuri Dixit Responds being Pregnant while filming Dola Re Song in Devdas Movie

కొన్ని పాటలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. అలాంటిదే డోలారే డోలారే సాంగ్‌. 'దేవదాసు' సినిమాలోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ బ్లాక్‌బస్టర్‌ హిట్టే.. ఇందులో హీరోయిన్లు ఐశ్వర్యరాయ్‌, మాధురీ దీక్షిత్‌ పోటీపడుతున్నట్లుగా డ్యాన్స్‌ చేశారు. ఒకరిని మించి మరొకరు తమ ఎనర్జీ, స్వాగ్‌తో అబ్బుపరిచారు. అయితే ఈ పాట షూటింగ్‌ చేసే సమయానికి మాధురీ దీక్షిత్‌ ప్రెగ్నెంట్‌ అని కొన్ని రోజులుగా పలు కథనాలు తెరపైకి వస్తున్నాయి. 

డోలారే సాంగ్‌..
అందుకు కారణం లేకపోలేదు. దివంగత కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ వద్ద పని చేసిన డ్యాన్సర్‌ రుబీనా ఖాన్‌ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డోలారే సాంగ్‌ షూటింగ్‌ చేసేటప్పుడు మాధురి దీక్షిత్‌ నాలుగు నెలల గర్భవతి అని పేర్కొంది. దాంతో సోషల్‌ మీడియాలో నటి ప్రెగ్నెన్సీ గురించి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వాటిపై తాజాగా మాధురి దీక్షిత్‌ స్పందించింది. 

నేను ప్రెగ్నెంట్‌ కాదు
మాధురి మాట్లాడుతూ.. ''దేవదాసు' సినిమా 2002 జూలై 12న విడుదలైంది. అదే ఏడాది మే నెలలో కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లోనూ ప్రదర్శితమైంది. ఆ మరుసటి ఏడాది అంటే 2003 మార్చి 17న నాకు కొడుకు అరిన్‌ జన్మించాడు. కాబట్టి మీరే లెక్కేయండి.. షూటింగ్‌ టైంలో నేను ప్రెగ్నెంట్‌ ఏంటి? ఇకపోతే ఆ సమయంలో నేను భారత్‌కు, అమెరికాకు తరచూ ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. 

పెళ్లయ్యాక అమెరికాకు..
అందులోనూ ఇక్కడన్నీ నైట్‌ షూట్సే ఉన్నాయి. దానివల్ల నా ఆరోగ్యం కాస్త దెబ్బ తింది, అలసటకు లోనయ్యాను. అంతే తప్ప ఇంకేం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా మాధురీ దీక్షిత్‌.. డాక్టర్‌ శ్రీరామ్‌ నేనేను 1999లో పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత అమెరికాకు మకాం మార్చింది. అయితే అప్పటికే సంతకం చేసిన సినిమాల కోసం తరచూ భారత్‌కు వచ్చి షూటింగ్‌ పూర్తి చేసేది. 

సినిమా
అలా చివరగా దేవదాసు చేసి సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. మాధురి- శ్రీరామ్‌ దంపతులకు కుమారులు అరిన్‌, ర్యాన్‌ సంతానం. కొంతకాలం ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదించాక తిరిగి సినిమాల్లో అడుగుపెట్టింది మాధురి. చివరగా భూల్‌ భులయ్యా 3లో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'మా బెహన్‌' ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్‌ 4న నేరుగా విడుదల కానుంది.

చదవండి: నా కలలు ఛిద్రం.. ఈ ముగింపు ఊహించలేదు: విఘ్నేశ్‌ శివన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement