బ్యాక్‌ నుంచి ఫోటోలు, వీడియోలు ఎలా తీస్తారు? నటి సీరియస్‌ | Neha Dhupia Loses Cool At Photographers Over Back Shots | Sakshi
Sakshi News home page

నడుస్తుంటే వెనుక నుంచి ఫోటోలు,వీడియోలా?. ఫైర్‌ అయిన హీరోయిన్‌

Jul 2 2026 12:28 PM | Updated on Jul 2 2026 12:41 PM

Neha Dhupia Loses Cool At Photographers Over Back Shots

సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్‌ ఈవెంట్స్‌కి వచ్చినప్పుడు వారిని మీడియా కవర్‌ చేయడం సహజమే. ఇక సినిమా తారలు అయితే ఎక్కడ కనిపించినా కెమెరాలు ‘క్లిక్‌’ అంటూనే ఉంటాయి. అయితే కొంతమంది ఫోటోగ్రాఫర్లు మాత్రం వారిని కెమెరాలను రకరకాల యాంగిల్స్‌లో పెట్టి సినీ తారలను అభ్యంతరకంగా చూపించే ప్రయత్నాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపై బాలీవుడ్‌ నటి నేహా ధూపియా ఫైర్‌ అయింది. అలా ఫోటోలు తీస్తున్న మీడియా ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

పదే పదే చెబుతున్నా వినరా?
తాజాగా ముంబైలో ఈ ఈవెంట్‌కు హాజరైన నేహా ధూపియా.. అక్కడ తనను ఫోటోలు తీస్తున్న మీడియా ఫోటోగ్రాఫర్లపై ఫైర్‌ అయింది. ‘మీలో ఎవరు వెనుకవైపు నుంచి ఫోటోలు , వీడియోలు తీస్తున్నారు? ఎందుకు అలా చేస్తున్నారు. నన్నే కాదు ఏ హీరోయిన్‌ని కూడా వెనుక నుంచి ఫోటోలు తీయొద్దు. బ్యాగులు సర్దుకుంటుంటే.. పుస్తకాలు తీసుకుంటున్నా.. చివరకు నార్మల్‌గా నడచుకుంటూ వెళ్తే కూడా వెనక నుంచి ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు? ఇలాంటి పనులు చేయొద్దని పదే పదే చెబుతున్నా ఫోటోగ్రాఫర్లు వినడం లేదు. మీడియాతో ఎంతో గౌరవంగా మాట్లాడతాం. మీరు కూడా అంతే మర్యాదగా నచుడుకోండి’ అని నేహా సీరియస్‌ అయింది.

అందుకే సీరియస్‌..
నేహా ధూపియా ఈ స్థాయిలో సీరియస్‌ అవ్వడానికి గల కారణం కూడా ఉంది. గతంలో ఆమె రన్నింగ్‌ ట్రాక్‌పై పరుగెడుతుండగా.. కొంతమంది ఇబ్బందికరమైన యాంగిల్స్‌లో ఫోటోలు, వీడియోలు తీశారు. అవి నెట్టింట బాగా వైరల్‌ అయ్యాయి. నెటిజన్స్‌ దారుణమైన కామెంట్స్‌ పెట్టారు. తాజా ఈవెంట్‌లో కూడా అలా నడుస్తుండగా..వెనుక నుంచి ఫోటోలు తీయడంతో పాత విషయాన్నిగుర్తు చేస్తూ ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.సెలబ్రిటీలను కవరేజ్ చేసేటప్పుడు ఒకరి వ్యక్తిగత పరిధులు దాటకుండా చూసుకోవడం అవసరమని ఆమె పేర్కొన్నారు. పదే పదే హెచ్చరించినా వినకపోవడం వల్లే తాను ఈ విధంగా అందరి ముందు స్పందించాల్సి వచ్చిందని వివరించారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ఆమె తీసుకున్న స్టాండ్‌కు నెటిజన్స్‌ మద్దతు ఇస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement