రీసెంట్ టైంలో విడాకుల విషయంతో వార్తల్లో నిలిచిన బాలీవుడ్ నటి మౌనీరాయ్.. ఇప్పుడు ఎవరూ ఊహించని పాత్రలో నటించింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌కి తల్లిగా చేసింది. వచ్చే నెల 5వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ట్రెండింగ్ బ్యూటీస్ మృణాల్ ఠాకుర్, పూజా హెగ్డే హీరోయిన్లు కావడం విశేషం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన)
వరుణ్ ధావన్, మృణాల్ ఠాకుర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'. డేవిడ్ ధావన్ దర్శకుడు. వదిలిన ట్రైలర్ బట్టి చూస్తే హీరో.. ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమిస్తాడు. పెళ్లికి ముందే వాళ్లిద్దరినీ గర్భవతుల్ని కూడా చేస్తాడు. మరి వీళ్లిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? సదరు అమ్మాయిలు ఒకరికి ఒకరు ఎదురుపడ్డారా? లేదా? అనే కన్ఫ్యూజన్ కామెడీనే స్టోరీ అని తెలుస్తోంది.
ఈ మూవీలోనే వరుణ్ ధావన్ పాత్రకు అద్దె తల్లిగా మౌనీరాయ్ కనిపించనుంది. నిజజీవితంలో వీళ్లిద్దరికీ వయసు వ్యత్యాసం ఏడాదే. కానీ తల్లికొడుకులుగా నటించడం విశేషం. ఇకపోతే ఈ మూవీ టైపు స్టోరీలు హిందీలో ఇదివరకే బోలెడన్ని వచ్చాయి. మరి ఈ చిత్రం ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి? జూన్ 5న రిలీజ్ పెట్టుకున్నారు. అయితే దీని కంటే ఒకరోజు ముందు 'పెద్ది' వస్తోంది.
(ఇదీ చదవండి: బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్)


