ప్రామిస్‌.. అలా పెళ్లి చేసుకోను : కంగనా | Kangana Ranaut Respond About Her Marriage Rumours | Sakshi
Sakshi News home page

ప్రామిస్‌.. అలా పెళ్లి చేసుకోను : కంగనా క్లారిటీ

May 23 2026 2:15 PM | Updated on May 23 2026 2:45 PM

Kangana Ranaut Respond About Her Marriage Rumours

బాలీవుడ్‌ నటి కంగానా రనౌత్‌కు సంబంధించిన ఓ వీడియో గత రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో కంగనా మెడలో నల్ల పూజల దండా, చేతికి మట్టిగాజులు ఉన్నాయి. దీంతో ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ కొంతమంది ఆ వీడియోని షేర్‌ చేస్తున్నారు. తాజాగా దీనిపై కంగనా స్పందించింది. తనకు సీక్రెట్‌ పెళ్లి చేసుకునే అవసరం లేదని, ఒకవేళ​ పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటే కచ్చితంగా అందరికి చెప్పే చేసుకుంటానని తనదైన శైలీలో ఇన్‌స్టా స్టోరీలో బదులిచ్చింది.

‘నేను ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆ వీడియో,ఫోటో తీశారు. అది సినిమాలో నా క్యారెక్టర్‌. అది చూసి చాలా మంది నాకు కాల్స్‌ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న మహిళగా నటించాను. అందులో తప్పేముంది? నటీనటులు అన్నాక అన్ని పాత్రలు చేయాలి. రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అందరికి చెప్పే చేసుకుంటా. ఇది నా ప్రామిస్‌’ అని కంగనా చెప్పుకొచ్చింది. 

కంగనా ప్రస్తుతం క్వీన్‌ మూవీ సీక్వెల్‌లో నటిస్తోంది.  ‘క్వీన్‌’లో వివాహం రద్దయి విదేశాలకు వెళ్లిన మహిళగా కనిపించిన కంగనా.. సీక్వెల్‌లో పెళ్లైన మహిళగా కనిపించబోతున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement