ఫైట్‌కి  సై  | Nayanthara Goes full Action Mode Opposite Salman | Sakshi
Sakshi News home page

ఫైట్‌కి  సై 

May 28 2026 5:20 AM | Updated on May 28 2026 5:20 AM

Nayanthara Goes full Action Mode Opposite Salman

లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో కథానాయికలు పవర్‌ఫుల్‌ రోల్‌ చేయడం అనేది తెలిసిందే. అయితే అప్పుడప్పుడూ హీరో ఓరియంటెడ్‌ సినిమాల్లోనూ అలాంటి పాత్రలు హీరోయిన్లకు వస్తుంటాయి. అయితే అది అరుదుగా జరుగుతుంటుంది. ప్రస్తుతం నయనతారకు అలాంటి ఒక అవకాశం దక్కిందని సమాచారం. సల్మాన్‌ ఖాన్‌ సరసన నయనతార ఓ హిందీ–తెలుగు ద్విభాషా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె పాత్ర కొన్ని సంభాషణలకు, పాటలకు మాత్రమే పరిమితం కాదన్నది తాజా టాక్‌. నయనతార పాత్రకు యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయట. 

ఆమెది పవర్‌ఫుల్‌ యాక్షన్‌ క్యారెక్టర్‌ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం కొన్ని భారీ ఫైట్‌ సీక్వెన్స్‌కి సంబంధించిన చిత్రీకరణలో నయనతార పాల్గొన్నారట. ఈ సీన్స్‌ తీసే ముందు బాగా రిహార్సల్స్‌ చేసి కెమెరా ముందుకొచ్చారట ఈ బ్యూటీ. ఇప్పటివరకూ ఈ చిత్రం షూటింగ్‌ ముంబై, హైదరాబాద్‌ ప్రాంతాల్లో జరిగింది. ఈ షూటింగ్‌ చూసినవారు సల్మాన్‌–నయనతారల కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు. అలాగే సల్మాన్‌–నయనతార పాల్గొన్న యాక్షన్‌ సీన్స్‌ కూడా అదిరిపోయేలా ఉన్నాయట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఈద్‌కి రిలీజ్‌  కానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement