వేడుకకు చిరునామా ఆల్ఫా: ఆలియా భట్‌ | Alia Bhatt about Alpha movie | Sakshi
Sakshi News home page

వేడుకకు చిరునామా ఆల్ఫా: ఆలియా భట్‌

Jun 25 2026 12:21 AM | Updated on Jun 25 2026 12:21 AM

Alia Bhatt about Alpha movie

‘‘ఆల్ఫా’ పరంగా నాకు బాగా నచ్చిన విషయం ఈ మూవీ స్టోరీ ఇద్దరు కథానాయికల చుట్టూ తిరగడం. ఇలాంటి స్క్రిప్ట్‌లు చాలా అరుదుగా వస్తాయి. అందుకే ‘ఆల్ఫా’ జర్నీలో భాగం కావడం సంతోషాన్నిచ్చింది. వేడుకకు ఓ చిరునామాలా ఈ సినిమా నిలుస్తుంది’’ అని ఆలియా భట్‌ పేర్కొన్నారు. ఆలియా భట్, శార్వరి లీడ్‌ రోల్స్‌లో యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన చిత్రం ‘ఆల్ఫా’. ఈ సంస్థ నుంచి స్పై సినిమాలు చాలా వచ్చాయి.

కానీ అవి హీరో ఓరియంటెడ్‌ సినిమాలు. ఈ సంస్థలో స్పై యూనివర్స్‌లో రూపొందిన తొలి మహిళా ప్రధాన చిత్రం ‘ఆల్ఫా’. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ స్పై ఏజెంట్లుగా నటించారు ఆలియా, శార్వరి. శివ్‌ రావైల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 3న  రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఆలియా భట్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో చాలా ఎంజాయ్‌ చేస్తూ షూటింగ్‌ చేసినవాటిలో ‘ఆల్ఫా’ ఒకటి. ప్రతి రోజూ చాలా ఆసక్తిగా షూటింగ్‌కి వెళ్లేదాన్ని. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ‘ఆల్ఫా’ నాకు సరికొత్త అనుభూతినిచ్చింది’’ అని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement