రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మొదట జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కొచ్చిన ఈ సినిమా.. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులోకి వచ్చేసింది.
అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటి వరకు మ్యూటెడ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అన్‌మ్యూటెడ్ వర్షన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఓవర్‌సీస్ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంది. నేటి నుంచి ఇండియన్స్ ఆడియన్స్‌కు కూడా అన్ మ్యూటెడ్ వర్షన్ చూసే అవకాశం దక్కింది. ప్రస్తుతం దురంధర్-2 హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు.


