‘పెద్ది’ ప్రచారం కోసం ఆపరేషన్ వాయిదా | Ram Charan Hand Operation postponed for Peddi campaign | Sakshi
Sakshi News home page

‘పెద్ది’ ప్రచారం కోసం ఆపరేషన్ వాయిదా

May 31 2026 11:53 PM | Updated on Jun 1 2026 4:16 AM

Ram Charan Hand Operation postponed for Peddi campaign

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది’. ఈ సినిమా ప్రచారం మధ్యలో ఆయన చేతికి కట్టుతో కనిపించడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. దాంతో చాలామంది ఇది సర్జరీ జరిగిన తర్వాతి పరిస్థితి అనుకున్నారు. అయితే ఈ విషయంపై చరణ్‌ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఇప్పటివరకు ఎలాంటి ఆపరేషన్‌ చేయించుకోలేదని, తాత్కాలికంగా నొప్పి తగ్గించుకునేందుకు మాత్రమే కట్టు కట్టారని తెలిపారు. పెద్ది సినిమా రిలీజ్‌ తర్వాతే సర్జరీ చేయించుకుంటానని చరణ్‌ స్పష్టం చేశారు. కాగా ‘పెద్ది’లో పహిల్వాన్‌ పాత్రలో చరణ్‌ కనిపిస్తునన్నాడు. దానికోసం నిజమైన మల్లయోధులను తెప్పించి పెద్ది’లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సీన్‌ షూటింగ్‌లో ఒక పట్టుపట్టినప్పుడు ఆయన చేతికి చిన్నపాటి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆ నొప్పిని భరిస్తూనే, చరణ్‌ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.  

ఇక ఈ సినిమా రిలీజ్‌ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఓవర్సీస్‌కి కంటెంట్‌ను కూడా పంపించేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్ల పెంపు కోసం ప్రత్యేక జీవో కూడా విడుదలైంది. ప్రీమియర్‌ షోకు రూ.600 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. రిలీజ్‌ రోజు నుంచి 10 రోజుల పాటు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్సులో రూ.125 పెంపు అనుమతించారు. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. టికెట్‌ రేట్ల పెంపుపై వివాదాలు కొనసాగుతున్న వేళ, ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో వస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement