ప్రముఖ బాలీవుడ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బుల్లితెరతో పాటు సినిమాల్లో రాణిస్తోన్న ఆదిత్య సీల్- అనుష్క రంజన్ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఈ దంపతులు ప్రగ్నెన్సీని ప్రకటించారు. ఈ జంట తమ ప్రెగ్నెన్సీకి సంబంధించిన అందమైన ఫోటోలను పంచుకున్నారు. ఈ ప్రత్యేక క్షణం కోసం వందేళ్లుగా వేచి ఉన్నామని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.
ఆదిత్య, అనుష్క జంట ప్రెగ్నెన్సీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలలో నటి బేబీ బంప్ ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ జంటకు అనన్య పాండే, మౌనీ రాయ్, సోనాక్షి సిన్హా, వాణి కపూర్, మనీష్ మల్హోత్రా, నీల్ నితిన్ ముఖేష్, సోనాల్ చౌహాన్, రాకుల్ ప్రీత్ సింగ్, కుశాల్ టాండన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
కాగా.. ఆదిత్య, అనుష్క మొదటిసారి వారి కుటుంబం నిర్వహించిన ఒక కార్యక్రమంలో కలుసుకున్నారు. ఆ తర్లాత వీరి మొదటి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత.. అనుష్క పుట్టినరోజున పారిస్‌లో ఆదిత్య ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే, ఆదిత్య చివరిగా అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను నటించిన 'ఖేల్ ఖేల్ మే' చిత్రంలో కనిపించాడు.


